లక్నో: రాజ్యసభ(Rajya Sabha) ఎన్నికల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ నుంచి 8 మంది అభ్యర్థుల పేర్లను బీజేపీ ప్రకటించింది. కుల సమీకరణలకు తగినట్లు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి హరిదీప్ సింగ్ పురి పేరును యూపీ నుంచి వెల్లడిస్తారని ఆశించారు. కానీ యూపీ జాబితాలో ఆయన పేరు లేదు. కేంద్ర సహాయ మంత్రి బీఎల్ వర్మ, స్మృతి ఇరానీ పేర్లు కూడా ఆ లిస్టులో లేకపోవడం గమనార్హం. ధర్మపాల్ సింగ్, రాధాకాంత్ ఓజా, ప్రకాశ్ పాల్, ఎమ్మెల్సీ విద్యాసాగర్ సోంకర్, గోపీ కృష్ణ పాండే, రామ్ ప్రతాప్ సింగ్ చౌహాన్, మాజీ ఎంపీ ప్రియాంక సింగ్ రావత్, శ్రుతి గంగావర్.. యూపీ నుంచి బీజేపీ అభ్యర్థులుగా రాజ్యసభకు నామినేట్ కానున్నారు. మొత్తం 10 సీట్లను యూపీ నుంచి నింపనున్నారు. దీంట్లో బీజేపీ ఏడు సీట్లను ఈజీగా గెలుచుకోనున్నది. అయితే 8వ సీటు కోసం మాత్రం పోటీ తప్పదు. అక్టోబర్ 16న ఎన్నిక జరగనున్నది.
भारतीय जनता पार्टी की केंद्रीय चुनाव समिति ने उत्तर प्रदेश में होने वाले राज्यसभा द्विवार्षिक चुनाव 2026 हेतु निम्नलिखित नामों पर अपनी स्वीकृति प्रदान की है। https://t.co/8TB5Bp8VGM
— BJP (@BJP4India) October 5, 2026