దస్తురాబాద్: మండలంలోని దేవునిగూడెం ( Devunigudem School) ఎంపీపీఎస్ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అదనపు ఉపాధ్యాయుడి( Additional teacher ) ని కేటాయించాలని కోరుతూ గ్రామ సర్పంచ్ ఎండపెల్లి గంగన్న, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
దేవునిగూడెం ఎంపీపీఎస్ పాఠశాలలో ప్రస్తుతం 35 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తు న్నారని, ఒక్క ఉపాధ్యాయుడే బోధన బాధ్యతలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఒకే ఉపాధ్యాయుడు అన్ని తరగతుల విద్యార్థులకు బోధించాల్సి రావడంతో విద్యార్థులపై వ్యక్తిగత శ్రద్ధ చూపక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
ఉపాధ్యాయుల కొరత కారణంగా విద్యార్థుల చదువుకు ఇబ్బంది కలగకుండా అదనపు ఉపాధ్యాయుడిని వెంటనే నియమించాలని అధికారులను కోరారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.