సాగునీటిపై సర్కార్‌కు సోయి లేదు.. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఫైర్
రాష్ట్రం మీదుగా కృష్ణా, గోదావరి జలాలు వెళ్తున్నా సీఎం రేవంత్‌రెడ్డికి వాడుకునే సోయి లేకుండా పోయిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి విమర్శించారు.
- పట్టభద్రుల ఎన్నికల్లో బీఆర్ఎస్దే విజయం
- మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ధీమా
- రేవంత్ వల్లే రాష్ట్రంలో కరువు: పట్నం నరేందర్
మిర్యాలగూడ/చందంపేట(దేవరకొండ)/హాలియా/ఖమ్మం కమాన్‌బజార్/కోస్గి, అక్టోబర్ 27 : రాష్ట్రం మీదుగా కృష్ణా, గోదావరి జలాలు వెళ్తున్నా సీఎం రేవంత్‌రెడ్డికి వాడుకునే సోయి లేకుండా పోయిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి విమర్శించారు. రేవంత్‌రెడ్డి ఈ ప్రాంత రైతాంగానికి ద్రోహం చేసి తన గురువు చంద్రబాబు కాళ్లు కడిగేందుకు ఇక్కడి జలాలను ఆంధ్రాకు ఉపయోగపడేవిధంగా సహకరించారని ఆరోపించారు. ఫలితంగా తెలంగాణలో ఏర్పడిన కరువు ప్రకృతి తెచ్చింది కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని మండిపడ్డారు. మంగళవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ, దేవరకొండ, హాలియాలో నిర్వహించిన నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఓటరు నమోదు సన్నాహక సమావేశాల్లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని దుయ్యబట్టారు. ఆయా సమావే శాల్లో ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగ య్యయాదవ్, మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్ రావు, తిప్పన విజయసింహారెడ్డి, రమావత్ రవీంద్ర కుమార్, నోముల భగత్‌కుమార్, బూడిద భిక్షమయ్య గౌడ్, రాష్ట్ర నాయకుడు రాకేశ్‌రెడ్డి పాల్గొన్నారు.
నేతలు క్రియాశీలకం కావాలి : పువ్వాడ
ఖమ్మం-వరంగల్-నల్లగొండ పట్టభద్రుల నియోజక వర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం ఖాయమని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ధీ మా వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఖమ్మంలోని ముస్తాఫానగర్, గాంధీచౌక్, జిల్లా కోర్టు, ఎస్బీఐటీ కాలేజీ ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన ప్రత్యేక శిబిరాలను ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావుతో కలిసి పువ్వాడ మంగళవారం పరిశీలించారు.

అనంతరం పార్టీ శ్రేణుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ అభ్యర్థి విజయం కోసం పార్టీ నాయకులంతా క్రియాశీలకం కావాలని, పట్టభద్రుల ఓటర్ల నమోదును పక్కాగా చేపట్టాలని కోరారు. ఈ ఎన్నికల్లో నాయకులంతా విశ్రమించకుండా పనిచేయాలని సూచించారు. కొత్త వారితోపాటు గతంలో నమోదు చేసుకున్న పట్టభద్రుల ఓట్లను కూడా మళ్లీ నమోదు చేయాలని తెలిపారు. గత ఎన్నికల డేటా ఆధారంగా ఇంటింటికీ వెళ్లి వారి ఓట్లను మళ్లీ నమోదు చేయించాలని కోరారు.
కరువు తెచ్చింది ముమ్మాటికీ కాంగ్రెస్సే : పట్నం
రాష్ట్రంలో కరువుకు ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీ.. సీఎం రేవంత్‌రెడ్డే కారణమని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి ఆ రోపించారు. మంగళవారం నారాయణపేట జిల్లా కోస్గిలో జరిగిన పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహ న కార్యక్రమంలో పట్నం మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ ర్పడిన కరువుకు సీఎం అనాలోచిత నిర్ణయాలే కారణ మని విమర్శించారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా ఉన్న ప్పుడు నీటిని పక్క రాష్ర్టాలకు తరలించి తెలంగాణను ఎడారిగా మార్చిన ఘనత రేవంత్‌కే దక్కుతుందని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా భూ దోపిడీకి సీఎం రేవంత్ సోదరులు తెరలేపారని ఆరోపించారు. ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. పట్టభద్రుల ఎన్నికల్లో గతంలో మాదిరిగా ఈ సారి కూడా బీఆర్ఎస్ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అన్ని వర్గాలను దగా చేశారని విమర్శించారు. కొడంగల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ దూకుడుతో అధికారపక్ష నేతలకు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఓటమి భయం పట్టుకున్నదని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

