హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య (ఏఐఎస్జీఈఎఫ్) జాతీయ ఉపాధ్యక్షుడిగా టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నెల 28 నుంచి 30 వరకు కోల్‌కతాలో నిర్వహించిన జాతీయ కార్యవర్గ సమావేశాల్లో జగదీశ్వర్‌కు నూతన బాధ్యతలు అప్పగించారు.
ఈ సభలకు తెలంగాణ నుంచి 200 మంది టీఎన్జీవో నేతలు హాజరయ్యారు. మారం జగదీశ్వర్‌కు అసోసియేట్ అధ్యక్షుడు కస్తూరి వెంకట్, ముత్యాల సత్యనారాయణగౌడ్, కోశాధికారి రామినేన శ్రీనివాస్‌రావు, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్హుస్సేని శుభాకాంక్షలు తెలిపారు.