హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): ‘రాధాకృష్ణా..! మీ బెదిరింపులు, మీ బ్లాక్‌మెయిల్‌తో మీ స్టూడియోకి పిలిపించుకొనే ప్రముఖులతో మీరు ప్రవర్తించే తీరు, మీ జుగుప్సాకరమైన ప్రవర్తన, మీ ప్రశ్నించే విధానం మీ మరుగుజ్జుతనానికి, మీ అహంకారానికి నిదర్శనం’ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జీ జగదీశ్‌రెడ్డి ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ్ణపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘ప్రపంచమంతా కుల, మతాల గోడలను బద్దలుకొట్టి నాగరికత వైపు వెళ్తుంటే.. మీ ఆలోచనలు, ఇంకా కులచట్రంలోనే ఇరుకొని ఉండటమనేది మీ మరుగుజ్జుతనానికి నిదర్శనం. మీరు అంతకంటే ఎక్కువ ఎత్తుకు ఎదగలేకపోయారు’ అని విమర్శించారు.
ఇంట్లో కుటుంబసభ్యులు ఉంటరు అన్న విషయాన్ని గ్రహించి చాలామంది మహిళా సెలబ్రిటీలు మీ ఇంటర్వ్యూకి రావడానికి భయపడుతున్నారని ఆరోపించారు. ‘ఉద్యమ సందర్భంలో మీరెంత విషం చిమ్మినా, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తెలంగాణ మంత్రివర్గంపై, శాసనసభపై దిగజారి మాట్లాడినా, ఏ విచారణ అకరలేకుండా మిమ్మల్ని అసెంబ్లీకి పిలిపించి 100 సార్లు జైలుకు పంపే అవకాశం వచ్చినా కేసీఆర్ క్షమాభిక్ష వల్లే, కేసీఆర్ దయాగుణం వల్లే మీరు ఇవ్వాళ బయట ఉన్నారు’ అని పేర్కొన్నారు.
ఇటీవల వేమూరి రాధాకృష్ణ రాసిన వ్యాసంలో తనను రాజకీయ మరుగుజ్జు అంటూ వ్యాఖ్యానించిన నేపథ్యంలో జగదీశ్‌రెడ్డి గురువారం ఒక వీడియోను విడుదల చేశారు. ‘రాధాకృష్ణగారూ.. నా వ్యాఖ్యలపై స్పందించినందుకు, భుజాలు తడుముకొని నేరాన్ని అంగీకరిస్తూ ముందుకొచ్చినందుకు ధన్యవాదాలు. కాకపోతే అది చాలా బేలగా, గందరగోళంగా ఉన్నది. దొరికిపోయిన నేరస్తుడి తత్తరపాటు అందులో కనిపిస్తున్నది’ అని జగదీశ్‌రెడ్డి దుయ్యబటారు.
‘కులమతాలకతీతంగా 90% మంది ప్రజలు కేసీఆర్‌ను ఇష్టపడతారు. హైదరాబాద్‌సహా తెలంగాణలో సెటిలైన వాళ్లందరూ చంద్రబాబు కంటే కేసీఆర్ పాలనలోనే సుఖంగా, సంతోషంగా, స్వేచ్ఛగా ఉన్నామని భావిస్తున్నారు. ఈ విషయాన్ని 2018, 2023 ఫలితాలు స్పష్టంగా చెప్పాయి. సెటిలర్లంతా కేసీఆర్ వెంటే ఉన్నారు. నువ్వు ఎన్ని చెప్పినా కేసీఆర్ నుంచి సెటిలర్లను విడదీయలేవు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని చంద్రబాబు కేసీఆర్‌తో నేరుగా ఢీకొంటే, చంద్రబాబును తిరసరించారు. కేసీఆర్ వెంట సెటిలర్లు నిలబడ్డారు. 2023లో కూడా అదే పునరావృతం అయింది’ అని జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు.
‘మాట్లాడితే ఆంధ్ర ప్రజలకు టేకేదారులం నేను, చంద్రబాబే అన్నట్టుగా మీరు చెప్పుకున్నా ఏపీ ప్రజలు చంద్రబాబును తిరసరించిన సంగతి గుర్తుపెట్టుకోండి. కానీ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక వర్గంవారు, కొద్ది మంది మొదటినుంచీ తెలంగాణ నాయకులను కించపరిచేవిధంగా, మా నాయకుల వ్యక్తిత్వాలను హననం చేసే విధంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్లతోనే మా పంచాయితీ. వాళ్ల ముసుగులు తీసి వాళ్ల భరతం పడతామని మాత్రమే చెప్పిన. ఏ ఆధారాలు లేకుండా మా నాయకులపై రాసిన రాతల గురించే ప్రస్తావించిన. మీడియా, జర్నలిజం విలువల గురించి మాట్లాడిన. మీరు ఆ అంశాన్ని వదిలేసి కేసీఆర్‌పై, కేటీఆర్‌పై, బీఆర్ఎస్పై అకసునంతా వెళ్లబోసుకున్నరు. విషాన్ని వెళ్లగకిండ్రు’ అని ఫైరయ్యారు. ‘బీఆర్ఎస్పై మీరు చేసిన విశ్లేషణ, మీరు ఉపయోగించిన భాష, వాడిన పదాలు జర్నలిజం పరిధులను దాటాయి. అది మీ అహంకారాన్ని తెలియజేస్తున్నది’ అని మండిపడ్డారు.
‘నేను ఏమిటో మీకు తెలియకపోవడం మీ మరుగుజ్జుతనం. నేను 11 ఏండ్ల వయసులోనే కులం గోడలను బద్దలుకొట్టి, సామాజిక అంతరాలు చెరిపేసే ఆలోచనతో వికసించినవాణ్ణి. 16 ఏండ్లకే ప్రజల కోసం ప్రాణమివ్వడానికి వెళ్లినవాణ్ణి. ఆ తర్వాత నాకు జన్మనిచ్చిన ఈ నేల తల్లి కోసం 25 ఏండ్ల్లుగా నమ్ముకున్న నాయకుడు కేసీఆర్ వెంట నడుస్తున్నవాణ్ణి. నిరంతర విద్యుత్తు సరఫరాకు కృషిచేసినవాణ్ణి. విజయం సాధించినవాణ్ణి. నా పరిపక్వత ఏందో.. నా రాజకీయ ప్రస్థానమేందో అందరికీ తెలుసు’ అని జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. మీరు రాసిన పోలికల్లోనే మీ మరుగుజ్జు స్థాయి కనిపిస్తున్నదని ఎద్దేవా చేశారు. నువ్వు అనుకున్న చోటుకు చేరుకోలేక అక్కడే నిలబడిపోయావే అదే మరుగుజ్జుతనం’ అని చురకలంటించారు. ‘మీ దగ్గరికి వచ్చిన ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులకు మీరిచ్చే స్వాగతం దారుణం. వారిపై మీ ప్రవర్తన, మీ కురుచ సంసారానికి నిదర్శనం. దానినే మరుగుజ్జుతనం అంటారు’ అని పేర్కొన్నారు. ‘నిజమే.. మేం జాగీరుదారులం కా ము, కాపలాదారులం.. ఈ విషయాన్ని కేసీఆ ర్ వందసార్లు చెప్పారు. తెలంగాణ తల్లి వాకిట జాగిలాలం’ అని జగదీశ్ స్పష్టంచేశారు.