హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం మోసాలు బయటపడొద్దనే హింసను ప్రేరేపిస్తున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(Jagadish Reddy) ఆరోపించారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో (Thirumalagiri incident) శాంతియుతంగా ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులపై కాంగ్రెస్ గుండాల దాడిని ఖండిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్లోనే బీఆర్ఎస్ పై దాడులు జరుగుతున్నాయని తెలిపారు.
రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారు. పోలీసుల సమక్షంలోనే శిబిరాన్ని కూల్చివేశారు. కాంగ్రెసుతో కలిసి పోలీసులు పనిచేస్తిన్నట్లుగా ఉందని అనుమానం వ్యక్తం చేశారు. రుణమాఫీపై(Loan waiver) ఇప్పటి వరకు స్పష్టమైన ప్రకటన లేదు. చెయ్యని రుణమాఫీకి కాంగ్రెస్ ప్రచారాలతో డంబాచారాలకు పోతున్నదని మండిపడ్డారు.
రుణమాఫీ పై రైతులు స్వచ్ఛందంగా ఆందోళనలు చేస్తున్నారు. స్వయానా మంత్రులే పూర్తిస్థాయిలో మాఫీ కాలేదని చెబుతున్నా ప్రభుత్వం కవరింగ్ చేస్తున్నది. దాడులు చేసి రెచ్చగట్టాలని చూస్తున్నారు. ఎన్ని దాడులు చేసినా ప్రజల కోసం అనుభవించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. తిరుమలగిరి సంఘటన పై విచారణ చేయాలి. రైతాంగానికి న్యాయం జరిగే వరకు ఎన్ని దాడులు చేసినా మా పోరాటం ఆగదన్నారు.