గ్రేటర్ హైదరాబాద్లో ఆషాఢ మాసం బోనాల సందడి మొదలైంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించి, తొలి బోనం సమర్పించారు.
కాగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు కూడా అమ్మవారికి పట్టువస్ర్తాలు, తొలి బోనం సమర్పించారు.