హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఉద్యోగుల 57డిమాండ్లలో 16 డిమాండ్లకు అంగీకారం తెలిపినందున ప్రభు త్వం వెంటనే వాటి అమలుకు ఆదేశాలు ఇవ్వాలని ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు డిప్యూటీ సీఎం భట్టి విక్రమారకు విజ్ఞప్తిచేశారు. ఉద్యోగుల మిలిగిన న్యాయమైన డిమాండ్లను కూడా విడతలవారీగా అమలు చేయాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల మెడికల్ రీయింబర్స్మెంట్ పెండింగ్ బిల్లులు రూ.180.38 కోట్లు విడుదల చేసిన సందర్భంగా శుక్రవారం ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎంను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈపీఎస్ రద్దుచేసి, ఓపీఎస్ అమలు చేయాలని విన్నవించారు. ఉద్యోగుల 13వేల కోట్ల పెండింగ్ బిల్లుల్లో కొంతవరకు ఇచ్చారని, మిగతావి సకాలంలో చెల్లించాలని కోరారు. ఉద్యోగులకు హెల్త్‌కార్డులు జారీచేయాలని పేర్కొన్నా రు. ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు, జేఏసీ వైస్ చై ర్మన్ దేవరకొండ సైదులు, నాయకులు చావా రవి, సదానందగౌడ్, సైదులు, ముజీబ్, వెంకట్ పాల్గొన్నారు.