హైదరాబాద్, జూన్ 20(నమస్తే తెలంగాణ): రాబోయే మూడు రోజులపాటు రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
గురువారం హన్మకొండ, రామగుండం, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్లో 37.8 డిగ్రీలు, మహబూబ్నగర్, హైదరాబాద్లో 33 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.