హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ట్రైకలర్ ప్రాపర్టీస్ (Tricolor properties) సంస్థ కార్యాలయాలపై ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. బంజారాహిల్స్‌లోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో సోదాలు చేస్తున్నారు. ఐదు బృంధాలుగా ఏర్పడిన ఐటీ శాఖ అధికారులు హైదరాబాద్‌లోని 10 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడిచేశారు.
ముంబై, పట్నా, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై సహా దేశంలోని 16 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. కాగా, ఆదాయపు పన్ను చెల్లింపుల్లో వ్యత్యాసాన్ని గుర్తించిన ఐటీ శాఖ సంస్థ కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు. ట్రైకలర్స్ కంపెనీ విదేశాల్లోనూ ప్రాపర్టీ బిజినెస్ చేస్తున్నది. అయితే సోదాల సందర్భంగా అధికారులు భారీగా నగదు గుర్తించినట్లు తెలుస్తున్నది.