హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ నేతల ఇండ్లపై ఐటీ సోదాలు మూడోరోజూ కొనసాగాయి. శుక్రవారం ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి ఇండ్లలో అధికారులు తనిఖీలు చేశారు. బీజేపీ పెద్దల నేతృత్వంలో సోదాలు చేస్తున్నారనే కోణంలో ఎమ్మెల్యే జనార్దన్‌రెడ్డికి మద్దుతుగా ఆయన ఇంటి వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు మోహరించారు. ఇద్దరు ఎమ్మెల్యేలతో వ్యాపారాలు జరిపిన లైఫ్‌ైస్టెల్ యాజమాని గజ్జల మధుసూదన్‌రెడ్డి ఇండ్లు, కంపెనీల్లో సైతం సోదాలు జరిపినట్టు సమాచారం. మధుసూదన్‌రెడ్డి భార్య, పిల్లలను ప్రశ్నించినట్టు తెలిసింది. బీఆర్ఎస్ నేతలపై కక్షసాధింపు చర్యగానే దాడులు చేయిస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.