హైదరాబాద్, అక్టోబర్ 24(నమస్తే తెలంగాణ):హైదరాబాద్ రాయదుర్గం కూడలిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న టీ-స్వేర్ నిర్మాణ డిజైన్లను ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు సచివాలయంలో పరిశీలించారు. ఇప్పటికే టెండర్ ప్రకటన విడుదల కాగా పలు సంస్థలు తమ డిజైన్లను మంత్రి ఎదుట ఉంచాయి. స్పందించిన శ్రీధర్‌బాబు న్యూయార్ టైమ్స్ స్వేర్ తరహాలో 24 గంటలూ సందర్శకుల ను ఆకట్టుకునేలా టీ-స్వేర్ను రూపొందించాలని సూచించారు.
హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సి ల్ ఆధ్వర్యంలో హ్యాక్-2.0 పేరుతో నవంబర్ 6న నిర్వహిస్తున్న వార్షిక సైబర్ సెక్యూరిటీ, అవగాహన సదస్సులో ముఖ్య అతిధిగా పాల్గొనాలని మంత్రి శ్రీధర్‌బాబును నిర్వాహకులు ఆహ్వానించారు.