మహబూబ్నగర్, జూన్ 20 : ఇథనాల్ ఫ్యాక్టరీని అడ్డుకున్న ఘటనలో ఇటీవల అలంపూర్ కోర్టుకు రైతులను తీసుకెళ్లే సమయంలో సంకెళ్లు వేయడం దురదృష్టకరమని, మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని మల్టీ జోన్-2 ఐజీ సత్యనారాయణ అన్నారు. శుక్రవారం ఆయన మహబూబ్నగర్లో జోగుళాంబ జోన్ పరిధిలోని ఉమ్మడి జిల్లాల ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల అలంపూర్ కోర్టులో, సంగారెడ్డిలో జరిగిన ఘటనలు చాలా దురదృష్టకరమైనవని, ఇటువంటివి జరగకుండా చూస్తామని తెలిపారు. బాధ్యు లను సస్పెండ్ చేశామన్నారు.
ఎనికెపల్లి రైతులకు న్యాయం చేయండి
మొయినాబాద్, జూన్ 20: రంగారెడ్డి జిల్లా ఎనికెపల్లి గోశాల నిర్మాణంలో భూము లు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయా లని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డిని కోరారు. పేద రైతుల ను ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదంటూ ఇటీ వల పత్రికల్లో కథనాలు వచ్చిన నేపథ్యంలో శుక్రవారం రైతులను వెంటబెట్టుకుని కలెక్టర్ నారాయణరెడ్డిని కలిసి రైతులు తమ గోడు వెల్లబోసుకున్నారు. తమ భూములను ప్రభు త్వం లాక్కుంటే జీవనాధారం కో ల్పోతామని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. ఎకరాకు 1000 గజాల చొప్పున భూమిపరిహారం ఇ వ్వాలని వినతిపత్రం సమర్పించారు. పరిష్కారం తన పరిధిలో లేదని, సీఎంను కలవాలని కలెక్టర్ వారికి సూచించారు.