హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల అంశం తేలకముందే మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల లో ఎన్నికల పనులపై ప్రభుత్వం దృష్టిసారించినట్టు తెలుస్తున్నది. పట్టణాల్లో కొత్తగా కాలనీలు ఏర్పడ టం, జనాభా పెరుగుదలతో మున్సిపాలిటీల పరిధిలో వార్డులు డీ లిమిటేషన్ చేయాల్సిన అవసరం ఉన్నద ని అధికారులు చెబుతున్నారు. మున్సిపాలిటీల వారీగా ఓటర్ల జాబితా, ఎలక్టోరల్ పనులన్నీ సిద్ధం చేయాల్సి ఉందని పేర్కొంటున్నారు. దీంతో మున్సిపల్ కమిషనర్లకు డీ లిమిటేష న్ ప్రక్రియ ప్రారంభించాలని ఇప్పటి కే ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయినట్టు తెలుస్తున్నది. అంతేకాకుండా రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. అయితే మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వమే ఓ క్లారిటీకి రాలేకపోతున్నట్టు తెలుస్తున్నది. రాష్ట్రంలో మున్సిపాలిటీల సంఖ్య 155కు చేరుకోగా, వాటిలో 7 మున్సిపాలిటీలు మినహాయిస్తే మిగిలిన వాటిలో తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నది.
సేవా వారధి.. సర్వ్ ప్రాజెక్ట్ ; విద్యారంగంలో అమలుకు కసరత్తు
హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ) : విద్యారంగంలో సర్వ్ ప్రాజెక్ట్ సేవలను వినియోగించుకోవాలని విద్యాశాఖ భావిస్తున్నది. ఆయా సంస్థతో ఎంవోయూ కుదుర్చుకోవాలంటున్నది. ఇటీవలే బెంగళూరు వెళ్లి న అధికారుల బృందం ప్రాజెక్ట్ సర్వ్ పై వివరాలను ఆరా తీసింది. ఆర్థికపరమైనది కాకపోవడం, మన అవసరాలకు తగినట్టుగా ఉండటంతో ఈ ప్రా జెక్ట్పై ఆసక్తిచూపారు. పాఠశాలవిద్య, ఇంటర్ విద్యలో ఎలా అమలుచేయాలన్న అంశంపై మేధోమధనం జరుగుతున్నది. విద్యార్థుల కోసం కొన్ని మాడ్యూల్స్‌ను డిజైన్‌చేశారు. స్కిల్‌డెవలప్‌మెంట్, స్కిల్ అప్‌గ్రేడేషన్‌కు సంబంధించిన మాడ్యూల్స్‌లో విద్యార్థులకు తర్ఫీదునిస్తారు. ఇంటర్ వొకేషనల్ విద్యార్థులకు ప్రతీ ఏటా ఆన్ జాబ్ ట్రైనింగ్(వోజేటీ)ను నిర్వహిస్తారు. ప్రాజెక్ట్ సర్వ్ విధానంలో పలు కంపెనీల వలంటీర్లకు 3 నెలలపాటు పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నారు.