Boinapalli Vinod Kumar | సోనియా గాంధీ ఆత్మకథలో తెలంగాణ గురించి రాయకపోవడం బాధాకరం : మాజీ ఎంపీ వినోద్ కుమార్
Boinapalli Vinod Kumar | ఇటీవల ప్రచురితమైన సోనియా గాంధీ ఆత్మకథ లో తెలంగాణ గురించి రాయకపోవడం బాధాకరమని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.
హైదరాబాద్ : ఇటీవల ప్రచురితమైన సోనియా గాంధీ ( Sonia Gandhi ) ఆత్మకథ లో తెలంగాణ ( Telangana ) గురించి రాయకపోవడం బాధాకరమని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ( Vinod Kumar) అన్నారు. దశాబ్దాల సుదీర్ఘ పోరాట ఫలితం, ఎందరో బలిదానాలు, కేసీఆర్ అకుంఠిత దీక్షతో సాధించుకున్న తెలంగాణ గురించి ఆ పుస్తకంలో ఎందుకు వివరించలేదని ప్రశ్నించారు. సోనియా గాంధీ ఆత్మకథ కాదు తెలంగాణ ప్రజల బలిదానాలు తీసుకున్న ప్రేతాత్మ కథ అని విమర్శించారు.
తెలంగాణ భవన్లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ రమణ, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాల్గొన్నారు. నవంబర్ 29 యావత్ తెలంగాణ ఎప్పటికీ మర్చిపోలేని రోజని గుర్తు చేశారు. తెలంగాణ బానిస సంకెళ్లు తెంపిన రోజు ఇప్పటి తరానికి తెలంగాణ ఉద్యమం గురించి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమం, రాష్ట్రం ఏర్పాటు కాకపోతే మనం ఎక్కడ ఉండేవాళ్ళమోనని అన్నారు. జూన్ 2 తెలంగాణ రాష్ట్రం వచ్చింది అంటే దానికి అంకురార్పణ నవంబర్ 29న పడిందని, తెచ్చుకున్న తెలంగాణ కాపాడుకోవాలని కేసీఆర్ స్ఫూర్తిగా నవంబర్ 29 న అల్గునూరు లో ఏర్పాటు చేస్తున్న దీక్ష దివస్ స్ఫూర్తి సభను విజయవంతం చేయాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Male Prisoner Made To Wear Saree | జైలులో యువకుడికి చీర కట్టించి.. లైంగికంగా వేధించిన తోటి ఖైదీలు
Boinapalli Vinod Kumar | సోనియా గాంధీ ఆత్మకథలో తెలంగాణ గురించి రాయకపోవడం బాధాకరం : మాజీ ఎంపీ వినోద్ కుమార్
ఇళ్ల స్థలాల కోసం ఎర్రజెండాలు.. భూమి కోసం రైతు కుటుంబం పోరాటం
Tribals Migration | తెలంగాణలో వలస బాట పట్టిన గిరిజనులు.. వీడియో
AP News | బాధిత కుటుంబాలను ఆదుకుంటాం : ఏపీ హోం మంత్రి అనిత
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?

