Male Prisoner Made To Wear Saree | జైలులో యువకుడికి చీర కట్టించి.. లైంగికంగా వేధించిన తోటి ఖైదీలు
Male Prisoner Made To Wear Saree | ఒక కేసులో అరెస్టై రిమాండ్ నిమిత్తం జైలులో ఉన్న యువకుడిని తోటి ఖైదీలు వేధించారు. మూడు పండుగల సమయాల్లో అతడికి చీర కట్టించారు. ఆ యువకుడిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.
రాంచీ: ఒక కేసులో అరెస్టై రిమాండ్ నిమిత్తం జైలులో ఉన్న యువకుడిని తోటి ఖైదీలు వేధించారు. మూడు పండుగల సమయాల్లో అతడికి చీర కట్టించారు. ఆ యువకుడిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. జైలు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు పట్టించుకోలేదని అతడు ఆరోపించాడు. (Male Prisoner Made To Wear Saree) యువకుడి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జార్ఖండ్ రాజధాని రాంచీలో ఈ సంఘటన జరిగింది. 20 ఏళ్ల యువకుడు ఒక కేసులో అరెస్ట్ కావడంతో రాంచీలోని హోత్వార్ జైలులో కొంతకాలం రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.
కాగా, ఆ యువకుడిని జైలులోని తోటి ఖైదీలు లైంగికంగా వేధించారు. మహాశివరాత్రి, శ్రీరామనవమి, సర్హుల్ సందర్భంగా అతడికి మత్తుమందు ఇచ్చి చీర కట్టించారు. ఆ యువకుడిపై తోటి ఖైదీలు మూడుసార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. లైంగిక దాడిలో గాయపడి రక్తం కారినప్పటికీ చికిత్స అందించకపోగా ఆ యువ ఖైదీ ఫిర్యాదును జైలు అధికారులు పట్టించుకోలేదు. అతడి ఫిర్యాదు లేఖను చించివేయడంతో పాటు వైద్య చికిత్సను నిరాకరించారు.
మరోవైపు ఈ ఏడాది జూన్ 12న ఆ యువకుడిని నిర్దోషిగా రాంచీ కోర్టు విడుదల చేసింది. జైలు నుంచి విడుదలైన తర్వాత తాను ఎదుర్కొన్న కష్టాల గురించి కుటుంబ సభ్యులకు అతడు చెప్పాడు. దీంతో జైలులో తోటి ఖైదీలు ఆ యువకుడిని లైంగికంగా వేధించడంపై అతడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పలువురు ఖైదీలతో పాటు జైలు సూపరింటెండెంట్, జైలు ఆసుపత్రి వైద్య అధికారి, వార్డు ఇన్చార్జ్తో సహా 19 మందిపై కేసు నమోదు చేశారు. ఆ యువకుడి ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Male Prisoner Made To Wear Saree | జైలులో యువకుడికి చీర కట్టించి.. లైంగికంగా వేధించిన తోటి ఖైదీలు
Boinapalli Vinod Kumar | సోనియా గాంధీ ఆత్మకథలో తెలంగాణ గురించి రాయకపోవడం బాధాకరం : మాజీ ఎంపీ వినోద్ కుమార్
ఇళ్ల స్థలాల కోసం ఎర్రజెండాలు.. భూమి కోసం రైతు కుటుంబం పోరాటం
Tribals Migration | తెలంగాణలో వలస బాట పట్టిన గిరిజనులు.. వీడియో
AP News | బాధిత కుటుంబాలను ఆదుకుంటాం : ఏపీ హోం మంత్రి అనిత
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?

