మంచిర్యాల, ఆగస్టు 28(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘మా ఊరికి వచ్చిపోయే దారిలో ఉన్న రాళ్లవాగుపై బ్రిడ్జి నిర్మించాలని, గ్రామస్థుల కష్టం తీర్చాలని ఉమ్మడి పాలకులకు ఏండ్ల తరబడి మొరపెట్టుకున్నా ఎవ్వరూ కనికరించలేదు. కానీ.. సీఎం కేసీఆర్ మా ఊరి ప్రజలు పడుతున్న కష్టాన్ని అర్థం చేసుకున్నారు. రాళ్లవాగుపైన బ్రిడ్జి కట్టేందుకు ఇటీవల రూ.3 కోట్లు మంజూరు చేశారు. అందుకే రానున్న ఎన్నికల్లో.. మా ఊరి ప్రజల కష్టం తీర్చిన కేసీఆర్‌కే జై కొడతాం.. బీఆర్ఎస్కే ఓట్లేస్తాం’ అని మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలోని మందమర్రి మండలం అందుగుల్పేట గ్రామస్థులు స్పష్టం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయించిన బీఆర్ఎస్ అభ్యర్థి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని సోమవారం ఏకగ్రీవ తీర్మానం చేశారు.
బీఆర్ఎస్ పాలనలోనే తమ ఊరు అభివృద్ధి చెందిందని గ్రామస్థులంతా ముక్తకంఠంతో కొనియాడారు. రూ.55 లక్షలతో సీసీ రోడ్లు, రూ.18 లక్షలతో కాలువలు, రూ.12.60 లక్షలతో శ్మశానవాటిక, రూ.7.50 లక్షలతో పల్లె ప్రకృతి వనం, రూ.3.80 లక్షలతో రెండు హైమాస్ట్ లైట్లు, రూ.3.70 లక్షలతో నర్సరీ ఏర్పాటు చేయించారని హర్షం వ్యక్తం చేశారు. రూ.14 లక్షలతో పల్లె దవాఖాన, రూ.3 లక్షలతో లైబ్రరీ, రూ.18 లక్షలతో మహిళా భవన నిర్మాణ ప నులు సాగుతున్నాయని చెప్పారు. గ్రామంలో ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నీరు, రైతులందరికీ రైతుబంధు ఇస్తున్న బీఆర్ఎస్కే జై కొడుతామని, బాల్క సుమన్‌ను అత్యధిక మెజార్టీ తో గెలిపిస్తామని తీర్మానంలో పేర్కొన్నారు.
బాల్క సుమన్‌కు నాయీ బ్రాహ్మణుల మద్దతు
ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌కు చెన్నూ రు నియోజవకర్గ కేంద్రంలో నాయీ బ్రా హ్మణ సంఘం సభ్యులు మద్దతుగా నిలి చారు. అత్యవసరంగా సమావేశం నిర్వహిం చి తమ ఓట్లన్నీ మూకుమ్మడిగా వేస్తామని సంఘం సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశా రు. ఈ సమావేశంలో నాయీ బ్రాహ్మణ సంఘం గౌరవ అధ్యక్షుడు మామిడి పో చం, పట్టణ అధ్యక్షుడు వేయికండ్ల మహేశ్, ప్రధాన కార్యదర్శి వేయికండ్ల నాగరాజు, ఉపాధ్యక్షుడు మామిడి బాపు, కోశాధికారి శ్రీరాముల అశోక్‌తోపాటు కుల పెద్దలు, సంఘం సభ్యులు పాల్గొన్నారు.