హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం 37 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించినట్టు సమాచారం. శనివారం మధ్యాహ్నం నుంచి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన జీవోలను ప్రభుత్వం బయటికి విడుదల చేయలేదని తెలిసింది. వాస్తవానికి ఈ నెల 14వ తేదీతో జీవోలు సిద్ధమయ్యాయని సమాచారం. గతంలో హామీలు పొందిన, పార్టీలో చురుగ్గా పని చేస్తున్నవారు, రాజకీయ, సామాజికవర్గాలను దృష్టిలో ఉంచుకొని సీఎం రేవంత్‌రెడ్డి ఈ పదవులకు నామినేట్ చేశారని చెప్పుకుంటున్నారు. కార్పొరేషన్ పదవులు పొందినవారిలో.. పటేల్ రమేశ్‌రెడ్డి, కే శివసేనారెడ్డి, ఎన్ ప్రీతం, నూతి శ్రీకాంత్, ఎస్ అన్వేశ్‌రెడ్డి, అనిల్ ఈరవత్రి, ఎం విజయబాబు, రాయల నాగేశ్వర్రావు, కా సుల బాలరాజు, నేరెళ్ల శారద, బండారు శోభారాణి, సీహెచ్ జగదీశ్వర్ రావు, జంగా రాఘవరెడ్డి, మానాల మోహన్‌రెడ్డి, బెల్లయ్యనాయక్, ఆర్ గుర్నాథ్రెడ్డి, జ్ఞానేశ్వర్‌ముదిరాజ్, చల్ల నర్సింహారెడ్డి, మెట్టు సాయికుమార్, కొత్తకు నాగు, జనక్ ప్రసాద్, ఎండీ రియాజ్, ఎం వీరయ్య, నాయుడు సత్యనారాయణ, ఎంఏ జబ్బార్, టీ నిర్మల జగ్గారెడ్డి, రాంరెడ్డి మల్లారెడ్డి, కాల్వ సుజాత, పొదెం వీరయ్య, ఐత ప్రకాశ్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, అలేఖ్య పుంజల, ఎన్ గిరిధర్ రెడ్డి, మన్నె సతీశ్‌కుమార్, జెరిపెటి జైపాల్, ఈ వెంకటరామిరెడ్డి, ఎంఏ ఫహీమ్కు కార్పొరేషన్ పదవులు దక్కినట్టు ప్రచారం జరుగుతున్నది.