‘పీఎంశ్రీ’ బ్లాక్మెయిల్!
నూతన జాతీయ విద్యా విధానాన్ని (ఎన్ఈపీ) వ్యతిరేకిస్తున్న రాష్ట్రాలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుటిల నీతిని ప్రయోగిస్తున్నది. కొత్తగా ప్రకటించిన పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎంశ్రీ) పథకాన్ని అడ్డంపెట్టుకొని ఎన్ఈపీని బలవంతంగా రుద్దేందుకు పన్నాగాలు పన్నుతున్నది.
- ఎన్ఈపీని బలవంతంగా రుద్దే కుట్ర
- అమలుచేస్తేనే పీఎం శ్రీలోకి రాష్ట్రాలు
- ఇచ్చేవి మండలానికి రెండు స్కూళ్లే
- కేంద్రంతో ఎంవోయూ తప్పనిసరి
- సగం వాటా భరిస్తున్న రాష్ట్రాలపైపెత్తనం
- రాష్ట్రాల వాటా 9,232 కోట్లు
కేంద్రమే పూర్తిగా నిధులు ఇవ్వదు. రాష్ట్రాలు తమ వాటాను భరించాలి. అయినప్పటికీ కేంద్రం పెత్తందారీతనం ప్రదర్శించడం విమర్శలకు తావిస్తున్నది.
- 14,500 పీఎంశ్రీ పథకంలో దేశవ్యాప్తంగా ఎంపికచేసే పాఠశాలలు
- ఐదేండ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఖర్చు 27,360 కోట్లు
- కేంద్రం వాటా 18,128 కోట్లు
- రాష్ట్రాల వాటా 9,232 కోట్లు
హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): నూతన జాతీయ విద్యా విధానాన్ని (ఎన్ఈపీ) వ్యతిరేకిస్తున్న రాష్ట్రాలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుటిల నీతిని ప్రయోగిస్తున్నది. కొత్తగా ప్రకటించిన పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎంశ్రీ) పథకాన్ని అడ్డంపెట్టుకొని ఎన్ఈపీని బలవంతంగా రుద్దేందుకు పన్నాగాలు పన్నుతున్నది. ఎన్ఈపీని అమలుచేస్తేనే పీఎంశ్రీ స్కూళ్లను మంజూరుచేస్తామని షరతులు పెడుతున్నది. ఇందుకు కేంద్రంతో రాష్ట్రాలు అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని స్పష్టంచేసింది. ప్రభుత్వ పాఠశాలలను బాగు చేస్తామంటూ పీఎంశ్రీ పథకాన్ని ప్రకటించిన కేంద్రం ఇటీవల మార్గదర్శకాలు జారీచేసింది. ఎన్ఈపీని కేరళ, తమిళనాడుతోపాటు మరికొన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. తెలంగాణ సైతం పలు అంశాలపై అభ్యంతరాలు వ్యక్తంచేసింది. వ్యతిరేకించే రాష్ట్రాలను బ్లాక్మెయిల్ చేసేందుకు కేంద్రం ఈ పథకాన్ని వాడుకొంటున్నదనే విమర్శలున్నాయి. మోటర్లకు మీటర్లు పెడితే 0.5% ఎఫ్ఆర్బీఎం పరిమితిని పెంచుతామన్న కేంద్రం.. తాజాగా అదే తరహాలో పీఎంశ్రీ స్కూల్స్ పథకంపైనా షరతులు విధించడం గమనార్హం.
రాష్ట్రాల వాటా 9 వేల కోట్లు
పీఎంశ్రీ పథకానికి కేంద్రమే పూర్తిగా నిధులు ఇవ్వదు. రాష్ట్రాలు తమ వాటాను భరించాలి. అయినప్పటికీ కేంద్రం పెత్తందారీతనం ప్రదర్శించడం విమర్శలకు తావిస్తున్నది. దేశవ్యాప్తంగా ఈ పథకం కింద 14,500 స్కూళ్లను ఎంపికచేస్తారు. రాబోయే ఐదేండ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రూ.27,360 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇందులో కేంద్రం వాటా రూ.18,128 కోట్లు. మిగిలిన రూ.9,232 వేల కోట్లు రాష్ర్టాలే భరించాలి. స్కూళ్ల ఎంపికను కేంద్రమే చేపడుతుంది.
దరఖాస్తు ప్రక్రియ ఇలా..
పీఎంశ్రీ పథకానికి దరఖాస్తుల ప్రక్రియ అక్టోబర్ 1 నుంచి ప్రారంభం కానున్నది. ఆన్లైన్ పోర్టల్లో స్కూళ్లు స్వయంగా దరఖాస్తు చేసుకోవాలి. మొదటి రెండేండ్లలో మూడు నెలలకొకసారి చొప్పున సంవత్సరానికి నాలుగుసార్లు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రాథమిక, ప్రాథమికోన్నత, సెకండరీ స్కూళ్లు పోటీపడొచ్చు. మండలానికి ఒక ప్రాథమిక, ఒక సెకండరీ/ సీనియర్ సెకండరీ పాఠశాల చొప్పున రెండు స్కూళ్లను ఎంపికచేస్తారు. ఎంపిక, పర్యవేక్షణ కోసం పాఠశాలను జియోట్యాగింగ్ చేస్తారు. జియోట్యాగింగ్ కోసం భాస్కరాచార్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో ఇన్ఫర్పేటిక్స్ సేవలను వినియోగించుకొంటారు. ఈ పథకంలో భాగంగా స్కూళ్లను హరిత పాఠశాలలుగా అభివృద్ధి చేస్తారు. సోలార్ ప్యానళ్లు, ఎల్ఈడీ లైట్లు, ప్లాస్టిక్ రహిత, వ్యర్థ పదార్థాల నిర్వహణ, నీటి సంరక్షణ, పోషకాహార తోటల పెంపకం, పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపడుతారు.
ఎంపికలో మూడు దశలు
- రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు నూతన జాతీయ విద్యావిధానం అ మలుకు అంగీకరిస్తూ కేంద్రంతో ఒప్పందంపై సంతకాలు చేయాలి. ఎంపికైన పాఠశాలల్లో నిర్దేశిత ప్రమాణాలు సాధించేందుకు మద్దతు ఇస్తామని రాష్ర్టాలు అంగీకరించాలి.
- రెండో దశలో ఏకీకృత జిల్లా విద్యా సమాచార వ్యవస్థ (యునైటెడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్- యూడైజ్ ప్లస్) డాటా ఆధారంగా పీ ఎంశ్రీ పథకానికి ఎంపికయ్యే అర్హతలు ఉన్నాయో లేదో పరిశీలిస్తారు.
- మూడో దశలో కేంద్రం నియమించిన నిపుణుల బృందం ఆధ్వర్యంలో పాఠశాలల్లో ప్రత్యక్ష తనిఖీలు నిర్వహిస్తారు. ఆ బృందాలు ఇచ్చే నివేదిక ఆధారంగా కేంద్ర విద్యాశాఖ పాఠశాలలను ఎంపిక చేస్తుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BJP Govt
- Kerala
- NEP
- PMShri scheme
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

