అబద్ధం: రాష్ట్ర ప్రభుత్వం ఏఎన్ఎస్ అలవెన్స్‌ను ఆపేసి, రికవరీ చేయనున్నది.
నిజం: ప్రభుత్వం ఏఎన్ఎస్ అలవెన్స్‌ను ఆపేసి, రికవరీ చేయనున్నట్టు వస్తున్న తప్పుడు వార్తలను నమ్మవద్దు. ఈ విషయమై ఉన్నతాధికారులను కలువగా వారు స్పష్టత ఇచ్చారు. పోలీసు సిబ్బందికి ఏఎన్ఎస్ అలవెన్స్ ఇవ్వడంలో నిబంధనలను అతిక్రమించారని నిర్ధారించిన ఏజీ అడిట్.. అలవెన్స్‌ను ఆపేయాలని ఉత్తర్వులిచ్చింది. గతంలో అనేక జిల్లాల్లో ఆడిట్ అభ్యంతరంతో అలవెన్స్ ఆపివేసినా తిరిగి దానిని ఉన్నతాధికారులు పునరుద్ధరించారు. ప్రస్తుతం ఏజీ అడిట్ అభ్యంతరాన్ని ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వంతో చర్చించాక తుది నిర్ణయం తీసుకోనున్నారు. అప్పటివరకు ఏఎన్ఎస్ అలవెన్స్ కొనసాగుతూనే ఉంటుంది.
-రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు వై గోపిరెడ్డి