హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ) : టాలీవుడ్ నిర్మాత, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) చైర్మన్ దిల్ రాజు ఐటీ విచారణ ముగిసింది. బషీర్బాగ్లోని ఐటీ కార్యాలయంలో అధికారుల ఎదుట మంగళవారం దిల్ రాజు హాజరయ్యారు. సుమారు రెండు గంటలపాటు అధికారులు ఆయనను విచారించారు. ఇటీవల తన బ్యానర్ నుంచి విడుదలైన సినిమాల నిర్మాణ వ్యయం, ఆదాయంపై అధికారులు ఆరా తీసినట్టు తెలిసింది. ఐటీ అధికారులు అడిగిన డాక్యుమెంట్లు, బ్యాంక్ స్టేట్మెంట్లను దిల్ రాజు అందజేసినట్టు సమాచారం. అందుబాటులో ఉండాలని, ఎప్పుడు పిలిచినా రావాలని ఐటీ అధికారులు సూచించినట్టు తెలిసింది.