హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ) : ఆదాయం సమకూర్చుకునే మార్గాలపై ప్రభు త్వం దృష్టిపెట్టింది. దేవాదాయ శాఖ భూములను వాణిజ్య అవసరాలకు కేటాయించాలని నిర్ణయించింది. రోడ్ల వెంట ఉన్న భూముల్లో హోటళ్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, పెట్రోల్ బంకు లు ఏర్పాటు చేయాలని, 35కేవీ సబ్ స్టేషన్లకు దగ్గరగా ఉన్న భూముల్లో సౌర విద్యుత్తు ఉత్పత్తి ఫలకలు అమర్చాలని, మారుమూల ప్రాంతాల భూముల్లో వ్యవసాయాన్ని కొనసాగించాలని దేవాదాయ శాఖ ప్రతిపాదించింది.
482ఆలయాలు.. 28,341 ఎకరాలు
పది ఉమ్మడి జిల్లాల పరిధిలో దేవాదాయ శాఖ ఆధీనంలో 482 ఆలయాలుండగా, 28,341ఎకరాల భూములున్నాయి. వీటిపై ఏటా రూ. 20కోట్ల లోపే ఆదాయం వస్తున్నది. 5వేలకు పైగా ఎకరాలపై కేసులున్నాయి. దశాబ్దాలుగా న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు కొనసాగుతుండడంతో ఎలాంటి ఆదాయం సమకూరడం లేదు. కౌలు ధరలు కూడా అనేక దశాబ్దాలుగా సవరించకపోవడంతో అరకొర ఆదాయ మే వస్తున్నది. అందుబాటులో ఉన్న భూముల నుంచే సాధ్యమైనంత ఎక్కువ ఆదాయం పొం దాలని నిర్ణయించారు. వ్యవసాయ, వాణిజ్య, పడావు భూములుగా విభజించి వాటి ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని భావిస్తున్నారు. పలు జిల్లాల్లో ప్రధాన రహదారుల వెంట భూ ములుండగా, వాటిని వ్యవసాయానికి వినియోగిస్తున్నారు. వీటిని షాపింగ్ కాంప్లెక్స్‌లు, పెట్రో ల్ బంకుల ఏర్పాటుకు వినియోగించుకోవచ్చని ఆ శాఖ మంత్రి అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో చర్చించారు. వాటిని గు ర్తించి ప్రతిపాదనలు రూపొందించి, టెండర్ల పద్ధతిలో లీజుకు ఇవ్వాలని నిర్ణయించారు.
ముందుగా ఐదు జిల్లాల్లో సౌర ఫలకాలు
పడావు భూముల్లో సౌర విద్యుత్తు ఉత్పత్తి చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక ఇం ధన అభివృద్ధి సంస్థ (టీఎస్ రెడ్కో) ముందుకొచ్చింది. 700 ఎకరాలకుపైగా పడావు భూములున్నట్టు అధికారులు గుర్తించారు. ముందుగా 35కేవీ సబ్స్టేషన్లకు దగ్గరగా ఉన్న భూముల్లో సౌర ఫలకాలు ఏర్పాటు చేయాలని టీఎస్ రె డ్కో నిర్ణయించింది. నల్లగొండ, మె దక్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో 219ఎకరాలు ఉన్నట్టు గుర్తించారు. ఈ భూ ముల్లో సౌరఫలకాలతో ఉత్పత్తయ్యే విద్యుత్ ద్వారా సమకూరే ఆదాయాన్ని చెరిసగం తీసుకోవాలని నిర్ణయించారు.