KTR | హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): ప్రస్తుతం ట్రిపుల్ ఇంజిన్ కాలం నడుస్తున్నదని, డబుల్ ఇంజిన్ అవుట్ డేటెడ్గా మారిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మ హారాష్ట్రలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో సోమవారం మంత్రి కేటీఆర్ వ్యంగ్యంగా ట్వీట్ చేశా రు. ఎన్సీపీ ఎమ్మెల్యేలను బీజేపీ చీల్చిం ది. ఆ ఎమ్మెల్యేలు.. బీజేపీ, శివసేన (షిండే) వర్గంతో కొనసాగుతున్న రాష్ట్ర ప్రభుత్వంలో చేరిన విషయం తెలిసిందే.