ISTA | హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): ప్రపంచ ఆహార భద్రతలో ఇంటర్నేషనల్ సీడ్ టెస్టింగ్ అసోసియేషన్(ఇస్టా)కీలకపాత్ర పోషిస్తున్నదని తెలంగాణ విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్, ఇస్టా ప్రెసిడెంట్ డాక్టర్ కేశవులు అన్నారు. 2050 నాటికి ప్రపంచ జనాభా సుమారు 10 బిలియన్లకు చేరుతుందని, ఆహార ఉత్పత్తి అవసరం 50 శాతం పెరుగుతుందని పేర్కొన్నారు. అనుగుణంగా నాణ్యమైన విత్తనాలను అందించేందుకు చర్య లు చేపడతామని హామీఇచ్చారు. బ్రిటన్లోని కేంబ్రిడ్జి వర్సిటీలో డాక్టర్ కేశవులు అధ్యక్షతన ఇస్టా శతాబ్ది ఉత్సవాలు ఈ నెల 1 నుంచి 5 వరకు నిర్వహించారు.
ఈ సందర్భంగా కేశవులు మాట్లాడుతూ.. వ్యవసాయ ఉత్పాదకత, ఆహార భద్రత, అందరికీ పోషకాహారా న్ని అందించడంలో ఇస్టా ప్రముఖ పాత్ర పో షిస్తుందని చెప్పారు. పెరుగుతున్న జనాభాకు ఆహారం, పోషకాహార భద్రతను కల్పించడంలో ఇస్టా ముందంజలో ఉందన్నారు. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏవో) డైరెక్టర్ జనరల్ క్యూడోంగ్యు మాట్లాడుతూ.. ప్రపంచ జనాభాకు ఆహారభద్రతకు నాణ్యమైన విత్తనాలు కీలకమని చెప్పారు. శతాబ్ది ఉత్సవాలకు గు ర్తుగా కేంబ్రిడ్జిలో డాక్టర్ కేశవులు మొక్క నా టారు. ఉత్సవాలకు వివిధ దేశాల నుంచి వ్యవసాయ శాఖ మంత్రులు, ఎఫ్ఏవో, ఐఎస్ఎఫ్, సీఈసీడీ, ఎన్ఐఏబీ లాంటి అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు, 50 దేశాల నుంచి 250 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు.