దేశ విత్తనరంగంలో తెలంగాణే రారాజు
- రాష్ట్రంలో వ్యవసాయాభివృద్ధి బాగుంది
- హరిత విప్లవ పితామహుడు స్వామినాథన్ ప్రశంస
- ఇస్టా అధ్యక్షుడిగా ఎన్నికైన కేశవులుకు అభినందన
హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): దేశ విత్తనరంగంలో తెలంగాణ రాష్ర్టానిదే కీలకపాత్ర అని, రాష్ట్రంలో విత్తనరంగ అభివృద్ధికి మరింత అవకాశం ఉన్నదని హరిత విప్లవ పితామహుడు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ అన్నారు. తెలంగాణలో వ్యవసాయ అభివృద్ధి ఎంతో బాగున్నదని, పంట ఉత్పత్తులు కూడా భారీగా పెరిగాయని ప్రశంసించారు. ఇటీవల ఇస్టా అధ్యక్షుడిగా ఎన్నికైన తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ డాక్టర్ కే కేశవులు బుధవారం స్వామినాథన్ ఫౌండేషన్ ఆహ్వానం మేరకు చెన్నైలో ఎంఎస్ స్వామినాథన్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్వామినాథన్ వ్యవసాయ రంగంలో తెలంగాణ ప్రభుత్వ పనితీరును ఎంతగానో ప్రశంసించారని, రైతుబంధు, రైతుబీమా, సాగునీటి ప్రాజెక్టులతో ప్రభుత్వం వ్యవసాయానికి, రైతులకు జీవం పోసిందని కితాబు ఇచ్చారని కేశవులు తెలిపారు.
విత్తనరంగంలో ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పులు, విత్తన నాణ్యత, ఎగుమతులు ఇతర అంశాలపై స్వామినాథన్ చర్చించారని, దేశంలో విత్తనరంగం ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉన్నదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని చెప్పారు. రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించేందుకు తమ ఫౌండేషన్ కూడా కృషి చే స్తుందని స్వామినాథన్ చెప్పినట్టు వివరించారు. ఇస్టా అధ్యక్షుడిగా ఎన్నికైన కేశవులును అభినందించారు. ఒక అంతర్జాతీయ స్థాయి విత్తన సం స్థకు అధ్యక్షుడిగా భారతదేశం నుంచి ముఖ్యం గా తెలంగాణ నుంచి ఒక అధికారి ఎన్నికవడంపై హర్షం వ్యక్తం చేశారు. విత్తనరంగంలో మరింత కృషి చేయాలని కేశవులకు సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

