జెరూసలేం: పరిస్థితి తీవ్రరూపం దాల్చితే ఇరాన్‌పై మొత్తం ఎయిర్‌ఫోర్స్‌ను ప్రయోగించేందుకు దేశం సిద్ధంగా ఉందని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్ నూతన వైమానిక దళ అధిపతిగా మేజర్ జనరల్ ఒమర్ టిష్లర్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇరాన్‌లోని పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని, ఇజ్రాయెల్ యుద్ధ విమానాలన్నింటినీ రంగంలోకి దింపి.. భారీ స్థాయి ప్రతిస్పందనకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన ప్రకటించారు. అవసరమనుకుంటే మొత్తం వైమానిక దళాన్ని తూర్పు వైపునకు (ఇరాన్) ప్రయోగిస్తామని అన్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్ సైనిక సన్నద్ధతను ఇది తెలియజేస్తున్నది.