శేరిలింగంపల్లి, జూలై 15: కొత్తగూడ బొటానికల్ గార్డెన్, పాలపిట్ట సైక్లింగ్ పార్కులకు ప్రతిష్టాత్మక ఐఎస్వో సర్టిఫికెట్ లభించింది. తెలంగాణలో నాణ్యత ధ్రువీకరణ పొందిన మొదటి ఉద్యావనంగా నిలిచింది.
బాధ్యతాయుత మొక్కల పెంపకం, నిర్వహణ, ఆరోగ్యకరమైన ప్రకృతి పర్యావరణాన్ని కలిగిఉండడంపై ఈ ఐఎస్వో సర్టిఫికెట్ లభించింది. సోమవారం టీఎస్ఎఫ్డీసీ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ రంజిత్నాయక్ ఈ సర్టిఫికెట్ను అందుకున్నారు.