కుమారి ఆంటీకో న్యాయం? మాకో న్యాయమా?
ఫుట్‌పాత్‌పై వ్యాపారం చేసుకుంటున్న కుమారి ఆంటీకో న్యాయం..అదే స్ట్రీట్‌లపై వ్యాపారం చేసుకునే మాకో న్యాయమా? అంటూ నాలెడ్జ్ సిటీలోని స్ట్రీట్ వెండర్స్ ప్రశ్నించారు. సమాచారం లేకుండా టీఎస్ఐఐఎస్, ట్రాఫిక్ పోలీసులు దౌర్జన్యంగా తమ స్టాల్స్ తొలగించారని గురువారం ఆందోళన చేపట్టారు.
- నాలెడ్జ్ సిటీ స్ట్రీట్ వెండర్స్ ఆందోళన
- స్టాల్స్ తొలగింపుపై మండిపాటు
- స్వరాష్ట్రంలో బతికే పరిస్థితి లేదని నిర్వాహకుల ఆగ్రహం
కొండాపూర్, నవంబర్ 7: ఫుట్‌పాత్‌పై వ్యాపారం చేసుకుంటున్న కుమారి ఆంటీకో న్యాయం..అదే స్ట్రీట్‌లపై వ్యాపారం చేసుకునే మాకో న్యాయమా? అంటూ నాలెడ్జ్ సిటీలోని స్ట్రీట్ వెండర్స్ ప్రశ్నించారు. సమాచారం లేకుండా టీఎస్ఐఐఎస్, ట్రాఫిక్ పోలీసులు దౌర్జన్యంగా తమ స్టాల్స్ తొలగించారని గురువారం ఆందోళన చేపట్టారు. ట్రాఫిక్ ఇబ్బందులు కలిగించకుండా, సాఫ్ట్వేర్ సంస్థలకు దూరంగా బతుకుదెరువు కోసం చిరు వ్యాపా రం చేసుకునే తమపై దౌర్జన్యం చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాం డ్ చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు కలిగేలా, కనీసం అంబులెన్స్ సైతం వెళ్లలేని పరిస్థితిని కల్పిస్తున్న కుమారి ఆంటీ స్టాల్స్ వైపు కన్నెత్తి చూడని అధికారులు, తమపై ఇలా చర్యలు తీసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్ర శ్నించారు.
ఫుట్‌పాత్ స్టాల్స్ వైపు వెళ్లొద్దని, వ్యాపారాలకు ఇబ్బందులు కలిగించొద్దని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పినా టీజీఐఐఎస్ అధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చి స్టాల్స్ నడుపుతున్న వారిని పట్టించుకోని అధికారులు, స్థానికులమైన తాము నడుపుతున్న స్టాల్స్ తొలగించడం వెనక కారణాలెంటో చె ప్పాలని డిమాండ్ చేశారు. సొంత రాష్ట్రంలో బతికే పరిస్థితి లేకుండా అధికారులు నడుచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారులు 40 స్టాల్స్ తొలగించడంతో వాటిపై ఆధారపడి జీవిస్తున్న 100 కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

