CM KCR | కరివెన రిజర్వాయర్ పనులు పూర్తి కావొచ్చాయని.. అందుబాటులోకి వస్తే దేవరకద్ర నియోజకవర్గంలో మొత్తం 1.50లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. దేవరకద్రలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవరకద్ర బీఆర్ఎస్ అభ్యర్థి ఆల వెంకటేశ్వర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరిగిందో మీ కండ్ల ముందే ఉన్నది. పెండింగ్ ప్రాజెక్టులన్నింటి మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అందరూ కలిసి నెట్టంపాడు, బీమా, కల్వకుర్తి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసుకొని నీళ్లు తెచ్చుకున్నాం. మీదగ్గర కూడా కోయిల్‌సాగర్ లిఫ్ట్ మొదలుపెట్టినా పెండింగ్‌లో ఉండే. వెంకటేశ్వర్‌రెడ్డి పట్టుపట్టి పనులు పూర్తి చేయించి నీళ్లు వచ్చేలా ప్రయత్నం చేశారు. నిన్నగాక మీ కండ్ల ముందనే పాలమూరులో స్విచ్ఛాన్ ఆన్ చేశాను. పాలమూరు-రంగారెడ్డి పథకం అడ్డంకులన్నీ తొలగిపోతున్నాయి. త్వరలోనే నీళ్లన్నీ రాబోతున్నాయి’ అని తెలిపారు.
‘మీ నియోజకవర్గంలోనే కరివెన రిజర్వాయర్. ఈ రిజర్వాయర్ ఎక్కడ పెట్టాలని నేను వెంకటేశ్వర్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి కలిసి చెట్లు, గుట్లన్నీ స్వయంగా తిరిగాం. తక్కువ నష్టంతో ఎక్కువ నీళ్లు రావాలి.. గుట్టల వద్ద రిజర్వాయర్ ఉండాలని స్వయంగా పరిశీలన చేశాను. ఆ తర్వాత కరివెన రిజర్వాయర్‌ను కట్టుకున్నాం. రిజర్వాయర్ పనులు త్వరలోనే పూర్తి కాబోతున్నాయి. కొద్ది నెలల్లోనే నీళ్ల రాబోతున్నయ్. ఒకసారి కంప్లీట్ అయితే దేవరకద్ర నియోజకవర్గంలో 60వే-70వేలకు నీరందుతుంది. వెంకటేశ్వర్‌రెడ్డి సాధించిన 99వేలు కాకుండా.. మరో 60వేలు దాటితే 1.50లక్షల ఎకరాలకు దేవరకద్ర నియోజకవర్గానికి నీళ్లు అందుతయ్. ఈ రకంగా పని జరిగింది. మీ కండ్ల ముందున్నది. విషయాలన్నీ మీకు తెలుసు. మనం కొత్త మేనిఫెస్టోను విడుదల చేశాం. పెన్షన్, రైతుబంధు ఎంత పెంచుతాం.. సన్నబియ్యం ఎలా ఇస్తామనేది మీ కండ్ల ముందున్నది. వెంకటేశ్వర్‌రెడ్డి గట్టి మనిషి. ఆయన ఎప్పుడూ వ్యక్తిగత పనులు అడుగలేదు. ఎప్పుడు అడిగినా చెక్‌డ్యామ్‌లు, కాలువలు, డబుల్ బెడ్రూం, గృహలక్ష్మి ఇండ్ల గురించి అడిగారు తప్పా.. మరేం అడుగలేదు. ఆయన కోరిన కోర్కెలను గవర్నమెంట్ మళ్లీ వచ్చాక నెరవేర్చే బాధ్యత నాది’ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
‘చెక్ డ్యాం వెంకటేశ్వర్ రెడ్డి అని పేరు పెట్టాలి. పట్టుబడ్డి 30 చెక్ డ్యాంలు మంజూరు చేయించి లక్ష ఎకరాల్లో వరి పంట పండించాడు. మంచి నాయకుడు. ఐదు గంటలు వేచి ఉన్నారంటనే ఆయన విజయం ఖాయమైందని మనవి చేస్తున్నాను. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. హెలీకాప్టర్ చెడిపోవడం మూలానా లేట్ అయింది. ప్రజాస్వామ్యంలో మన ఆశించిన పరిణితి రావడంలేదు. ఆదేశాలు గొప్పగా దూసుకుపోతున్నాయి. ఎలక్షన్లు వస్తుంటాయి పోతాంటయ్. ఎన్నికలు రాగానే పార్టీ తరపులన వ్యక్తులు నిలబడుగారు. తప్పకుండా అభ్యర్థి మంచిచెడు చూడాలి. గుణగణాలు పరిశీలించాలి. అంతకంటే ముంఖ్యంగా పార్టీ నడవడిక, విధానం, ప్రజల గురించి ఆలోచన సరళి ఏంది..? అధికారం అప్పజెప్తే ఏ పంపిరపాలన చేస్తరో అనే చరిత్రను చూడాలి. ప్రజల దగ్గర ఉండే ఒక వజ్రాయుధం ఓటు. ఐదేండ్ల భవిష్యత్‌ను నిర్ణయిస్తుంది. ఆషామాషీగా అలవోకగా ఓటు వేయొద్దు. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఎవరి ద్వారా మేలు జరుగుతదో ఆలోచించాలి. అందుకోమే మీ విచక్షణ ఉపయోగించండి.. గ్రామాల్లో చర్చ పెట్టండి ఏది నిజమో ఆలోచించి ఓటు వేయండి’ అంటూ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.