మహదేవపూర్, ఏప్రిల్ 30 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్‌పల్లిలోని మేడిగడ్డ, అన్నారం బరాజ్‌ను గురువారం ఇరిగేషన్ కార్యదర్శి శ్రీధర్.. కలెక్టర్ రాహుల్‌శర్మతో కలిసి పరిశీలించారు. మేడిగడ్డ వద్ద కొనసాగుతున్న బోర్‌హోల్స్ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
మేడిగడ్డ, అన్నారం బరాజ్ వద్ద అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసి పనులు వేగవంతంచేయాలని తెలిపారు. సిబ్బంది కోసం గతంలో సీఆర్పీఎఫ్ పోలీసులు ఉపయోగించిన షెడ్లను పరిశీలించారు. అన్నారం ప్రాజెక్ట్ అప్‌స్ట్రీమ్‌ను పరిశీలించి.. బోర్‌హోల్స్ పనులను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక పరీక్షలను దశలవారీగా చేపట్టాలని, డ్రిల్లింగ్‌ను గట్టి శిల పొర వచ్చేంతవరకు కొనసాగించాలని సూచించారు.