హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఫిజికల్ డైరెక్టర్ పదోన్నతుల్లో అక్రమాలు జరిగాయని, వాటిపై ప్రభుత్వం వెంటనే విచారణకు ఆదేశించాలని రిజర్వేషన్స్ ప్రొటెక్షన్స్ స్ట్రగుల్ ఆర్గనైజేషన్ జాతీయ అధ్యక్షుడు కర్రె రవీందర్ డిమాండ్చేశారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఫిజికల్ డైరెక్టర్(గ్రేడ్-1) పోస్టులకు ఎలాంటి ప్రమోషన్ చానల్ లేదని, కానీ కొందరు అనధికారికంగా పదోన్నతులు పొందారని ఆరోపించారు.
హైదరాబాద్, నవంబర్20 (నమస్తే తెలంగాణ): జీవో 190 ప్రకారం సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీలోని 317జీవో బాధితులకు న్యాయం చేయాలని ఆల్ తెలంగాణ గవర్నమెంట్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఎట్గ్రీవ) డిమాండ్ చేసింది. ఈ మేరకు సొసైటీ కార్యదర్శి కృష్ణ ఆదిత్యను అసోసియేషన్ నాయకులు గురువారం కలిసి వినతిపత్రం అందజేశారు.