అచ్చంపేట రూరల్, జనవరి 29 : హాస్టల్లో విద్యార్థిని తలపై ఇనుప పైపు పడడంతో గాయాలైన ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది. అచ్చంపేట ఎస్సీ బాలికల హాస్టల్లో ఉంటూ నందిని ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నది. బుధవారం హాస్టల్ ఆవరణలో ఉండగా భవనంపై నుంచి ఇనుప పైపు ఊడిపడింది. ఆమె తలకు తీవ్ర గాయం కాగా వార్డెన్ స్థానిక దవాఖానకు తరలించారు. పరిసరాల్లో కోతుల బెడద అధికంగా ఉన్నదని, భవనంపై నుంచి వెళ్లే క్రమంలో పైపును కదలించడంతో ఊడిపోయి ఉండొచ్చని విద్యార్థులు అభిప్రాయం వ్యక్తంచేశారు.