హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ) : ఇండియన్ రైల్వే ఇనిస్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ ఇంజినీరింగ్ అండ్ కమ్యూనికేషన్స్ (ఇరిసెట్) 67వ వార్షికోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రైల్వేకు చెందిన పలువురు సీనియర్ అధికారులతో పాటు ఇరిసెట్ డైరెక్టర్ పాల్గొన్నారు. రైల్వేలో కొత్తగా నియామకమైన అధికారులు, సూపర్వైజర్లకు శిక్షణ ఇచ్చే సంస్థగా దీనికి మంచి గుర్తింపు పొందింది. ఈ సంస్థ ఈ ఏడాదిలో 5,195 మందికి శిక్షణ ఇచ్చి రికార్డు సృష్టించినట్టు రైల్వే అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి
రేపు ఇందిరాపార్క్ వద్ద బీఎడ్ అభ్యర్థుల ధర్నా
హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): రాబోయే డీఎస్సీలో ఎస్జీటీ పోస్టులతో సమానంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయాలనే డిమాండ్‌తో బీఎడ్ అభ్యర్థులు ఆందోళన బాటపడుతున్నారు. ఈ మేరకు ఈ నెల 26న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద ధర్నా చేయనున్నామని రాష్ట్ర బీఎడ్ అభ్యర్థుల సంఘం నాయకులు ప్రకటించారు. బీఎడ్ చేసిన వారు సుప్రీంకోర్టు తీర్పుతో ఎస్జీటీ అవకాశం కోల్పోయినట్టు తెలిపారు. మరోవైపు ప్రభుత్వం ఖాళీ అయిన పోస్టులను 70 శాతం మేర పదోన్నతుల ద్వారా భర్తీ చేయడంతో తమకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని పేర్కొన్నారు. వందశాతం పోస్టులను కేవలం నోటిఫికేషన్ల ద్వారా మాత్రమే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం చేపట్టనున్న ధర్నాకు బీఎడ్ అభ్యర్థులు తరలిరావాలని పిలుపునిచ్చారు.
‘ఎన్ఎంఎంఎస్’కు 32,942 మంది హాజరు
హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తేతెలంగాణ): రాష్ట్ర వ్యాప్తంగా 174 సెంటర్లలో ఆదివారం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీం పరీక్ష నిర్వహించారు. 34,538 మంది విద్యార్థులకు గానూ 32,942 మంది హాజరయ్యారు. ఈ పరీక్ష ద్వారా మెరిట్ విద్యార్థులను ఎంపిక చేసి కేంద్రం ద్వారా ఏటా స్కాలర్షిప్లు అందించనున్నారు.