హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): పోలీస్ శిక్షణ, పరిశోధనా విభాగాలకు కొత్త అధిపతులను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వానికి చెందిన నియామకాల క్యాబినెట్ కమిటీ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీసు అకాడమీ (ఎస్వీపీఎన్పీఏ) నూతన డైరెక్టర్‌గా సుజీత్ పాండేను నియమించింది. సుజీత్ పాండే 1994వ బ్యాచ్ ఉత్తరప్రదేశ్ క్యాడర్‌కు చెందినవారు.
ఇప్పటివరకు ఎన్పీఏ డైరెక్టర్‌గా సేవలందించిన 1993 ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐపీఎస్ అధికారి అమిత్ గార్గ్ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) డైరెక్టర్‌గా బదిలీ చేసింది. బీపీఆర్‌అండ్‌డీ డైరెక్టర్ జనరల్‌గా 1993వ బ్యాచ్ హర్యానా క్యాడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి అలోక్ కుమార్ మిట్టల్‌ను నియమించింది.