నాగర్‌కర్నూల్/దోమలపెంట/ ముంబై మార్చి 29 : శ్రీశైలం- హైదరాబాద్ ప్రధాన రహదారి దోమలపెంట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహారాష్ట్ర ఐపీఎస్ అధికారి సుధాకర్ పాండే, అతని బంధువు మృతిచెందారు. హైదరాబాద్ పోలీసు అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న సుధాకర్‌తోపాటు భగవత్ కిషన్‌రావు శనివారం శ్రీశైలం మల్లన్న దర్శనానికి ఇన్నోవా కారులో హైదరాబాద్ నుంచి బయలుదేరారు. నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలోకి రాగానే ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్నాయి. దీంతో సుధాకర్ (45), కిషన్‌రావు (50) అక్కడికక్కడే మృతిచెందారు. మృతదేహాలను కల్వకుర్తి ప్రభుత్వ దవాఖానకు తరలించి కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఐపీఎస్- 2011 బ్యాచ్‌కు చెందిన సుధాకర్ ప్రస్తుతం ముంబై పోలీస్ పోర్ట్ జోన్ డీసీపీగా పనిచేస్తున్నారు.