హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ) : ‘తెలంగాణ-నార్త్ ఈస్ట్ ఇండియా కనెక్ట్’ టెక్నో కల్చరల్ ఫెస్టివల్‌కు లోగో తయారు చేసేందుకు ఆసక్తి గల విద్యార్థులు, ఆర్టిస్టులు, డిజైనర్లు, ప్రజల నుంచి ఎంట్రీలను ఆహ్వానిస్తున్నట్టు గవర్నర్ కార్యాలయం తెలిపింది. గురువారం ప్రకటన విడుదల చేసింది. లోగోతోపాటు ట్యాగ్‌లైన్, పోస్టర్‌ను తయారు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నది.
అరుణాచల్‌ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర రాష్ర్టాలతో తెలంగాణకు ఉన్న సత్సంబంధాలను ప్రతిబింబించేలా లోగో, ట్యాగ్‌లైన్, పోస్టర్ ఉండాలని సూచించింది. ఉత్తమ లోగో డిజైన్‌కు రూ.15వేలు, బెస్ట్ ట్యాగ్‌లైన్‌కు రూ.5వేలు, ఉత్తమ పోస్టర్ డిజైన్‌కు రూ.20వేలు అందజేయనున్నట్టు వెల్లడించింది. ఆసక్తిగల వారు www.governor.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది.
హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ) : పుప్పాలగూడ భూ కుంభకోణంపై న్యాయవాది ఇమ్మానేని రామారావు ఇచ్చిన ఫిర్యాదుపై లోకాయుక్త్త గురువారం కేసు నమోదు చేసింది. హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ మాజీ కమిషనర్ అరవింద్‌కుమార్, డీఎస్ ఆర్ఎస్ఎస్ఐ అధినేత రఘురామరెడ్డి, హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ పుష్పాలగూడ సర్వే నంబరు 277,280, 281కి సంబంధించి భూ కుంభకోణంపై ప్రముఖ న్యాయవాది రామారావు ఇమ్మానేని ఫిర్యాదు చేశారు.
దీంతో హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్‌ను ప్రభుత్వ భూముల్లో జరిగిన అక్రమాలపై పూర్తి దర్యాప్తు జరపాలంటూ లోకాయుక్త ఆదేశాలు జారీచేసింది. సెప్టెంబర్ 28లోగా పూర్తి నివేదిక సమర్పించాలని జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.