హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 14 (నమస్తే తెలంగాణ): ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సైబర్ సెక్యూరిటీ కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్(సీడాక్) హైదరాబాద్ ప్రతినిధి తెలిపారు. సిడాక్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పీజీ డిప్లొమా ఇన్ అడ్వాన్స్డ్ సెక్యూర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్(పీజీ-డీఎఎస్ఎస్డీ) పేరుతో ప్రతిష్టాత్మక కోర్సును రూపొందించినట్టు పేర్కొన్నారు. ఈ కోర్సు చేసిన వారికి దేశ, విదేశాల్లోని ఐటీ కంపెనీలు పుష్కలంగా ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయని తెలిపారు. ఈ కోర్సు దరఖాస్తుకు ఈ నెల 18 వరకు అవకాశం ఉందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 7382053731/32, www.acts. cdac.in వెబ్సైట్, ఈ మెయిల్ training-hyd@c.dac.in ద్వారా సంప్రదించాలని సూచించారు.