హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ) : కానిస్టేబుల్ అభ్యర్థులకు 9 నెలలుగా కొనసాగుతున్న శిక్షణకు వివిధ కారణాలతో హాజరుకాని 130 మందికి రాష్ట్ర పోలీస్ అకాడమీ ఆహ్వానం పంపింది. వీరంతా ఈ నెల 22లోపు ఆయా శిక్షణ కేంద్రాల్లో రిపోర్టు చేయాలని కోరింది.
రేపు డీఈఈ సెట్
హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ) : టీజీడీఈఈ సెట్‌ను ఈ నెల 10న నిర్వహించనున్నట్టు సెట్ కో కన్వీనర్ శ్రీనివాసచారి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం తెలుగు మీడియం, మధ్యాహ్నం ఇంగ్లిష్, ఉర్దూ మీడియం వారికి ఆన్లైన్లో పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. ఇప్పటికే హాల్‌టికెట్లను విడుదల చేసినట్లు తెలిపారు. విద్యార్థులు సకాలంలో హాజరవ్వాలని సూచించారు.
ఎప్‌సెట్ వెబ్ ఆప్షన్ల నమోదు షురూ
హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ) : ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించే టీజీ ఎప్‌సెట్ వెబ్ ఆప్షన్ల నమోదు సోమవారం నుంచి ప్రారంభమైంది. తొలిరోజు 8,823 మంది వెబ్ ఆప్షన్లను ఎంచుకున్నారు. ఈ నెల 15 వరకు వెబ్ ఆప్షన్ల ఎంపికకు అవకాశముంది. సోమవారం వరకు 95,655 మంది కౌన్సెలింగ్‌కు హాజరైనట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన ఒక ప్రకటనలో తెలిపారు.