త్వరలో కొవిడ్ మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా.. దరఖాస్తులు ఆహ్వానించిన ప్రభుత్వం
Invitation to applications for Covid Ex Gratia | కరోనా మహమ్మారితో మృతి చెందిన బాధిత కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం రూ.50వేల ఎక్స్గ్రేషియా అందించనున్నది. ఇప్పటికే

హైదరాబాద్ : కరోనా మహమ్మారితో మృతి చెందిన బాధిత కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం రూ.50వేల ఎక్స్గ్రేషియా అందించనున్నది. ఇప్పటికే మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో బాధిత కుటుంబాల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ విపత్తుల నివారణ శాఖ మంగళవారం మీ సేవ కేంద్రాల ద్వారా ఎక్స్గ్రేషియా కోసం దరఖాస్తులు అందజేయాలని తెలిపింది.
కరోనాతోనే మృతి చెందినట్టు అఫీషియల్ డాక్యుమెంట్, ఇతర ధ్రువీకరణపత్రాలతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 4,500 మీసేవా కేంద్రాల్లో ఎక్కడైనా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పింది. బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఆయా పత్రాలతో దరఖాస్తులు అందజేయాలని సూచించింది.
జిల్లా కలెక్టర్ చైర్మన్గా, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ, జిల్లా కేంద్రంలోని ఆసుపత్రి సూపరింటెండెంట్లు సభ్యులుగా ఉండే కొవిడ్ డెత్ నిర్ధారణ కమిటీ కరోనా మరణానికి సంబంధించి అధికారిక ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేస్తుంది. మరిన్ని వివరాలకు 040-48560012 ఫోన్ నంబరులో, meesevasupport@telangana.gov.in మెయిల్లో సంప్రదించాలని డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ కోరింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

