హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 17 ( నమస్తే తెలంగాణ ) : విద్యార్థుల మేథస్సుకు పదును పెట్టే వినూత్న ఆవిష్కరణలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు హైదరాబాద్ జిల్లా విద్యాధికారి రోహిణి చెప్పారు. ‘ఇన్స్పైర్ అవార్డ్స్ మానక్ -2024-25 గోడ పత్రికను ఆమె బుధవారం ఆవిష్కరించారు. ఆరు నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ప్రాజెక్టులను ఆన్లైన్లో నమోదు చేసుకోవడానికి సెప్టెంబర్ 15 చివరి తేదీ అని పేర్కొన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, డీఎస్వో ధర్మేందర్రావు, శ్రీకాంత్ పాల్గొన్నారు.