హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ) : 2025-26 విద్యా సంవత్సరానికి పీజీ మెడికల్ డిగ్రీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి మేనేజ్మెంట్ కోటా (ఎంక్యూ1, ఎంక్యూ2, ఎన్ఆర్ఐ అండ్ ఎంక్యూ3, ఇన్స్టిట్యూషనల్ కోటా) కింద అడ్మిషన్లకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని కాళోజీ హెల్త్ వర్సిటీ కోరింది.
మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఎంక్యూ-1 క్యాటగిరీ కింద 15% ఆల్ ఇండియా కోటాకు, 85% స్థానిక విద్యార్థులకు కల్పిస్తూ జీవో తెచ్చింది. ఈ నేపథ్యంలో ఆన్లైన్ రిజిస్ట్రేషన్లను రీఓపెన్ చేసినట్టు వర్సిటీ తెలిపింది. అభ్యర్థులు బుధవారం ఉదయం 6 గంటల నుంచి గురువారం సాయంత్రం 5 గంటల వరకు https://pvttspgmed.tsche.in/ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని సూచించింది. వివరాలకు 7901098840, 9490585796 నంబర్లను సంప్రదించాలని కోరింది.