Hyderabad | స్టార్టప్‌లకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారింది.. ఇది ‘ఇంక్-42’ నివేదిక అంటున్న మాట. భాగ్యనగరంలో అత్యాధునిక మౌలిక వసతులు, పరిమిత వ్యయంతో స్టార్టప్‌లను సమర్థంగా నిర్వహించే అత్యంత అనుకూల వాతావరణం ఉండటంతో స్టార్టప్ వ్యవస్థాపకులు, పెట్టుబడిదారులు హైదరాబాద్‌నే తమ గమ్యస్థానంగా ఎంచుకొంటు న్నారని వెల్లడించింది. బీ2బీ, సాస్(ఎస్ఏఏఎస్), తయారీ, ఫిన్‌టెక్, ఐటీ రంగాలకు దిక్సూచిగా మారుతున్నదని పేర్కొన్నది.
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): దేశంలో స్టార్టప్‌లకు గమ్యస్థానంగా హైదరాబాద్ మారింది. ఏటా వందలకొద్దీ కొత్త స్టార్టప్‌లు ఏర్పాటవుతూనే ఉన్నాయి. అదే స్థాయిలో సరికొత్త ఆలోచనలతో అద్భుత ఆవిష్కరణలు చేస్తున్న స్టార్టప్‌లతో దేశ, విదేశాలకు చెందిన వెంచర్ క్యాపిలిస్టులు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. దీంతో భారత దేశ స్టార్టప్ పవర్ హౌస్‌గా హైదరాబాద్ మారింది. 2014 నుం చి 2023 వరకు స్టార్టప్‌లకు రూ. 21,569 కోట్లు నిధులు సమకూరటమే నిదర్శనం. గత మూడేండ్లలోనే ఒకేసారి 240 స్టార్టప్‌లకు భారీ మొత్తంలో పెట్టుబడులు వచ్చాయి. అ త్యాధునిక మౌలిక వసతులు, పరిమిత వ్య యంతో స్టార్టప్‌లను సమర్థంగా నిర్వహించే అత్యంత అనుకూల వాతావరణం ఉండటం తో స్టార్టప్ వ్యవస్థాపకులు, పెట్టుబడిదారులు హైదరాబాద్‌నే తమ గమ్యస్థానంగా ఎంచుకొంటున్నారు. బెంగళూరును సైతం వెనక్కి నెట్టి హైదరాబాద్ పెట్టుబడులను ఆకర్షిస్తున్నది. ప్రధానంగా టీ-హబ్ ఏర్పాటు స్టార్టప్ రంగానికి ఎంతో ఊతమిచ్చేలా మారింది. అదేవిధంగా ఐఐటీ-హైదరాబాద్ వంటి అగ్రశేణి విద్యాసంస్థల నుంచి నైపుణ్యం కలిగిన మానవవనరుల లభ్యత స్టార్టప్ రంగం మరింత వృద్ధి చెందేందుకు దోహదం చేస్తున్నది. మొత్తంగా హైదరాబాద్ మహానగరం బీ2బీ, సాస్ (ఎస్ఏఏఎస్), తయారీ, ఫిన్‌టెక్, ఐటీ రంగాలకు దిక్సూచిగా మారుతున్నది. ఈ మేరకు ప్రముఖ స్టార్టప్ మీడియా ప్లాట్‌ఫాం ఇంక్42 తాజా నివేదికలో వెల్లడించింది.
దేశంలోని ఇతర మెట్రో నగరాల్లో స్టా ర్ట ప్ కార్యకలాపాలు హైదరాబాద్ కంటే ముం దుగానే ప్రారంభమయ్యాయి. ఆలస్యంగా అడుగుపెట్టిన హైదరాబాద్ అద్భుత ప్రగతిని నమోదు చేస్తున్నది. దేశవ్యాప్తంగా స్టార్టప్‌లకు 2014 నుంచి 2023 వరకు ఆకట్టుకునే స్థాయిలో పెట్టుబడులు వచ్చాయి. ఇందులో 1,900 ఒప్పందాల ద్వారా 141 బిలియన్ డాలర్ల నిధులు సమకూరాయి. స్టార్టప్‌ల కోసం పెట్టుబడిదారులు గతంలో ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు వంటి అగ్రశేణి నగరాలపై దృష్టి సారించేవారు. కానీ స్టార్టప్ రంగంలో హైదరాబాద్ క్రమం గా స్థానాన్ని పెంచుకుంటూ గణనీయమైన పెట్టుబడులను ఆకర్షిస్తున్నది. ముఖ్యంగా పు ణె, చెన్నై వంటి అభివృద్ధి చెందుతున్న నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో చాలా ఎ క్కువ స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయి.
2014లో కొత్త రాష్ట్రం ఏర్పాటైన తర్వాత నుంచి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఐటీ రంగంతో పాటు స్టార్టప్ ప్రోత్సహక కార్యక్రమాలు హైదరాబాద్‌లో గణనీయంగా పెరిగాయి. దాని ఫలితంగానే గత మూడేండ్లలో దేశంలోనే హైదరాబాద్ ప్రధాన స్టార్టప్ డెస్టినేషన్‌గా అవతరించింది. ఇంక్42 నివేదిక ప్రకారం.. హైదరాబాద్ కేంద్రంగా ఉ న్న సుమారు 240 స్టార్టప్‌లకు పెద్ద మొత్తంలో నిధులు వచ్చాయి. ఇందులో సుమారు 550 మందికిపైగా పెట్టుబడిదారులు ఇక్కడి స్టార్టప్‌లలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చా రు. 2014 జనవరి నుంచి 2023 ఆగస్టు నాటికి మొత్తం 2.6 బిలయన్ డాలర్ల నిధులు స్టార్టప్‌లకు వచ్చాయి.
భారతీయ స్టార్టప్ ల్కాండ్స్కేప్లోనే హైదరాబాద్ అద్భుత పనితీరును కనబరుస్తూ ముం దు వరసలో నిలిచింది. ప్రస్తుతం నగరంలో 4,369 టెక్ స్టార్టప్‌లు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన టీ హబ్‌లో 3,500 స్టార్టప్‌లు, 150 మంది మెంటర్లు, 350కిపైగా కార్పొరేట్ భాగస్వాములు ఉన్నట్టు టీ హబ్ సీఈవో మహంకాళి శ్రీనివాస్‌రావు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం స్టార్టప్‌లను ప్రోత్సహించేం దుకు టీ హబ్‌ను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత క్రమంగా దేశంలోనే అత్యుత్తమ ఆవిష్కరణ వ్యవస్థను తెలంగాణ కలిగి ఉంది. 2016లోనే రాష్ట్ర ప్రభుత్వం ఇన్నోవేషన్ పాలసీని రూపొందించి అమలు చేస్తున్నది. ఐటీ రంగంలోనే కాకుండా ఫార్మా, బయో, మెడికల్, అగ్రికల్చర్, ఉమెన్, సామాజిక అంశాల్లో ప్రత్యేకంగా స్టార్టప్‌లను ఏర్పాటు చేసేందుకు వీలుగా వేర్వేరు ప్రాంతాల్లో ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేయించారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు 20కి పైగా ఇంక్యుబేటర్లు పనిచేస్తున్నాయి.
స్టార్టప్‌లకు సంబంధించిన సమగ్ర సేవలు, సహాయ సహకారాలను అందిచేందుకు వీలుగా రూపొందించిన ‘స్టార్టప్ తెలంగాణ పోర్టల్’ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. రాష్ట్రంలో సరికొత్త ఆవిష్కరణలను (ఇన్నోవేషన్ ఎకో సిస్టం) వృద్ధిచేసేందుకు టీ-హబ్, టీఎస్ఐసీ, వీ-హబ్, రిచ్, టాస్క్, టీ-వర్క్స్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్, ఇమేజ్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు చేశారు. మెంటార్షిప్, ఇంక్యుబేషన్, పరిశ్రమల అనుసంధానం చేయడంతో వందల స్టార్టప్స్ మద్దతు పొందాయి. దీన్ని మరింతగా విస్తరించేందుకు రాష్ట్ర స్థాయిలో స్టార్టప్‌లకు ప్రత్యేకంగా గుర్తింపు వచ్చేలా చేసేందుకు ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.