హైదరాబాద్, డిసెంబర్ 10(నమస్తే తెలంగాణ) : గ్లోబల్ సమ్మిట్‌తో రాష్ర్టానికి రూ.5. 50 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని కాంగ్రెస్ సర్కారు చెబుతున్నదని కానీ అందులో డొల్ల కంపెనీలు ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు విమర్శించారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాయలంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. డొల్ల కంపెనీలకు అప్పులు ఉన్నాయని, వాటిని గతంలో బ్లాక్ లిస్టులో పెట్టారని వివరించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీహెచ్ఎంసీ డివిజన్ల పెంపు గెజిట్‌ను బీజేపీ వ్యతిరేకిస్తున్నదని, ఏ ప్రాతిపదికన విలీనం చేస్తున్నదో చెప్పాలని డిమాండ్ చేశారు. కులగణన తమ ఘనత అని కాంగ్రెస్ నాయకులు గొప్పగా చెప్పుకొంటున్నారని, మరి వివరాలు ఎందుకు బయటపెట్టలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.