హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): జస్టిస్ పినాకీ చంద్రఘోష్ కమిటీ గురువారం నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను ప్రారంభించనున్నది. ఈ మేరకు గురువారం బీఆర్కే భవన్లో నీటి పారుదల శాఖ అధికారులతో కమిటీ సభ్యులు సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా అదనపు వివరాలు అందించాలని అధికారులను ఆదేశించారు. వారు శుక్రవారం తొలుత మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లను పరిశీలించనున్నారు.