Bandi Sanjay | హైదరాబాద్ సిటీబ్యూరో, మే 11(నమస్తే తెలంగాణ): బాలికపై బండి భగీరథ్ లైంగిక వేధింపుల కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఆయన అనుచరుడు సంగప్ప కూడా విచారణ ఎదుర్కోక తప్పదని న్యాయ నిపుణులు స్పష్టంచేస్తున్నారు.
పోక్సో కేసు నమోదై నాలుగు రోజులైనా నిందితుడి ఆచూకీని గుర్తించడంలో పోలీసులు విఫలమవడం, బాధితురాలి వాంగ్మూ లం తీసుకొనే క్రమంలో వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించి దర్యాప్తునకు ఆదేశించడం, పర్యవేక్షణకు మహిళా ఐపీఎస్‌ను ప్రత్యేకాధికారిగా నియమించడంతో కేసు కీలక మలుపు తిరిగింది. దీంతో లోతైన దర్యాప్తు జరిగే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఇదే సమయంలో నిందితుడిని కాపాడేందుకు మధ్యవర్తులుగా సహకరించిన వారికి సైతం ఉ చ్చుబిగిసే అవకాశాలు ఉన్నాయని న్యాయనిపుణులు చెప్తున్నారు.
పోక్సో చట్టంలోని సెక్షన్-21 ప్రకారం నేరం జరిగినట్టు తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడం పౌరుల క నీస బాధ్యత అని చెబుతున్నారు. నేరం జరిగిన ట్టు సమాచారం ఉండీ.. దానిని పోలీసులకు చె ప్పకుండా దాచడం, లేదా నిందితుడిని రక్షించే ప్రయత్నం చేయడం శిక్షార్హమైన నేరమని వా రంటున్నారు. భగీరథ్‌పై నమోదైన కేసులో సంజయ్, సంగప్ప మధ్యవర్తులుగా వ్యవహరించారని, సెటిల్మెంట్కు ప్రయత్నించారన్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి.
సాక్ష్యాలు దొరికితే విచారణ తప్పదు
బాధితురాలి తల్లి ఫిర్యాదులో పలు కీలక విషయాలను ప్రస్తావించారు. కేంద్ర మంత్రి స మక్షంలోనే బాధితులను బెదిరించడం, ‘నువ్వు మైనర్‌వి’ అని పదే పదే మంత్రి గుర్తుచేయడం, బెదిరింపు ధోరణితో మాట్లాడటం వంటివి చట్టపరంగా నేరమన్నది న్యాయనిపుణుల వాదన. దీంతో సంజయ్‌కి సన్‌స్ట్రోక్ తప్పదా? అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. పోలీసులు ఇప్పటికే బాధితురాలి నుంచి వాంగ్మూలం సేకరించారు. నిజానిజాలు నిర్ధారణ కోసం పలువురి నుంచి వివరాలు సేకరించే అవకాశాలున్నాయి. నిందితుడి స్నేహితులతో పాటు కేసు రాజీకి ప్ర యత్నించిన సంగప్ప, సంజయ్‌ని సైతం విచారించే అవకాశాలున్నాయి. మధ్యవర్తిత్వం, బెది రించడం, సాక్ష్యాలను మార్చేందుకు ప్రయత్నించినట్టు సాక్ష్యాలు లభిస్తే సంగప్పతోపాటు సంజయ్‌ని కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చవచ్చని, అవసరమైతే అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుందని తెలిపారు. నిందితుడిని కాపాడే ప్రయత్నాలు జరిగితే వాటిని నేరపూరిత కుట్రగా దర్యాప్తు అధికారులు భావిస్తారన్నారు.
నిర్మల్ పోలీసుల పాత్రపై ఆరా
బాధితులు ఇచ్చిన ఫిర్యాదులో నిర్మల్ పో లీస్‌స్టేషన్ ప్రస్తావన తెచ్చారు. ప్రధాన నిందితుడైన భగీరథ్ స్నేహితుడు శ్రీరామ్ తమపై ఫి ర్యాదు చేశాడని బాధితురాలి తల్లి పేర్కొన్నారు. తన కూతురిని భగీరథ్‌కు పరిచయం చేసింది శ్రీరామ్ అని, తన కూతురు బ్లాక్మెయిల్ చేస్తున్నదంటూ శ్రీరామ్ తప్పుడు ఫిర్యాదు చేశారని ఫిర్యాదులో వెల్లడించారు. ఈ విషయంపైనా ద ర్యాప్తు అధికారులు దృష్టిసారించి, నిర్మల్ పోలీసుల పాత్రపై ఆరా తీస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేయలేదని చెప్తున్నా, ఫిర్యాదు వచ్చిన తర్వాత ఎందుకు లోతుగా దర్యాప్తు చేయలేదని ఆరాతీసే అవకాశాలు ఉన్నట్టు తెలిసింది.
దర్యాప్తు స్వేచ్ఛగా జరగనిస్తారా?
మైనర్‌పై లైంగిక హింస జరిగితే నిబంధనల ప్రకారం వెంటనే పోలీసులు కేసు నమోదు చేయాలి. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కి ఈ విషయం తెలియదా? ఆయనే పోలీసులకు స్వయంగా చెప్పాల్సి ఉన్నా, సెటిల్మెంట్కు ఎలా ప్రయత్నించారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పైగా సంజయ్‌కి రాష్ట్ర ప్రభుత్వ పెద్దల అండదండలు ఉన్నందున కేసు దర్యాప్తు అధికారికి స్వేచ్ఛ ఇస్తారా? దర్యాప్తు పారదర్శకంగా జరుగుతుందా?, హడావుడి చేసి, కేసును పక్కదారి పట్టిస్తారా? బాధితురాలికి తగిన న్యాయం చేస్తారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.