Bandi Sanjay | హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ)/సిటీబ్యూరో: కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు విషయంలో ఎట్టకేలకు రాష్ట్ర ప్రభు త్వం దిగొచ్చింది. బండి భగీరథ్ అరాచకాలపై, పోక్సో కేసు దర్యాప్తు పర్యవేక్షణాధికారిగా కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ గైక్వాడ్‌ను నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.
బీఆర్ఎస్ పార్టీతోపాటు అనుబంధ ప్రజాసంఘాలైన మహిళా, యువజన విభాగాల ఆధ్వర్యంలో జరిగిన పోరా టం, నమస్తే తెలంగాణ సహా పలు మీడియా, సోషల్ మీడియా వేదికలు విస్తృత వార్తా కథనాలతో ఎట్టకేలకు రేవంత్ సర్కార్ తలొగ్గింది. కాంగ్రెస్-బీజేపీ దోస్తీతో బండి సంజయ్ కొడుకును అరెస్టు చేయడంలో తాత్సారం చేస్తున్న ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుండటంతో ఆగమేఘాలపై సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలిచ్చారు. ‘సామాన్యులకు ఒక న్యాయం.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుక్కు మరో న్యా యమా?’ అంటూ బీఆర్ఎస్ నేతలు, మీడియా, సోషల్ మీడియా దు మ్మెత్తిపోస్తుండటంతో డీజీపీ సీవీ ఆనంద్పైనే సీఎం నెపం నెట్టే ప్రయత్నం చేశారు. పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో బండి భగీరథపై న మోదైన కేసుపై తక్షణమే విచారణ చేపట్టాలని డీజీపీ సీవీ ఆనంద్‌ను ఆదేశించారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పో క్సో కేసుపై సోమవారం ఉదయం సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. 8న ఫిర్యాదు వస్తే ఇప్ప టివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని డీజీపీని ప్రశ్నించారు. ‘నేను తిడితే.. నువ్వు ఏడ్చినట్టు చెయ్’ అన్న సామెత మాదిరిగా.. డీజీపీకి ఆదేశాలు ఇస్తున్నట్టు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు సీఎంవో నుంచి ప్రకటనలు ఇప్పించారు. అందులో ఆ కేసుకు సంబంధించిన వి వరాలను సీఎం రేవంత్‌రెడ్డికి డీజీపీ వివరించారు. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనలో పోలీస్ సిబ్బంది అంతా భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారని డీజీపీ వివరించా రు. అందుకే నిందితుడు భగీరథ్‌ను అరెస్టు చే యలేకపోయామని సంజాయిషీ ఇచ్చుకున్నా రు. సమగ్ర విచారణ కోసం ప్రత్యేక బృందాల ను ఏర్పాటు చేయాలని డీజీపీని సీఎం ఆదేశించారు. ఆ ఆదేశాలతో విచారణ కోసం డీజీపీ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు డీజీపీ ఆనంద్ సూచనలతో సైబరాబాద్ కమిషనర్ ఎం ర మేశ్ భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు ద ర్యా ప్తు పర్యవేక్షణాధికారిగా కూకట్పల్లి డీసీపీ రితిరాజ్‌ను నియమించారు. ఈ మేరకు సోమవా రం ఉత్తర్వులు సైతం వెలువడ్డాయి. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఈ కీలక కే సును ఆమె దర్యాప్తు చేయనున్నారు. మొదట సిట్ ఏర్పాటు చేస్తున్నట్టు మీడియాలో హడావుడి జరిగినా, చివరికి దర్యాప్తు పర్యవేక్షణాధికారిని నియమించడంతోనే ప్రభుత్వం సరిపెట్టుకున్నది. ఈ కేసు పురోగతిని రోజూ పర్యవేక్షిస్తూ, విచారణ నివేదికను నేరుగా కమిషనర్ కు సమర్పించాలని ఆదేశించారు. నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టొద్దని పైకి చెప్తున్నా.. ఈ కేసును నీరుగార్చడం కోసమే ప్రభుత్వం ఇలాంటి చర్యలు చేపడుతున్నదని ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తన కొడుకుపై పోక్సో కేసు నమోదైందన్న విషయం తెలిసిన వెంటనే బీజేపీ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ కా ర్యాలయం నుంచి పలు మీడియా సంస్థలకు ఫోన్లు వెళ్లాయని, డిజిటల్ మీడియాకు, యూ ట్యూబర్లకు, మెయిన్‌స్ట్రీమ్ మీడియాలోని కొన్ని పత్రికలు, చానెళ్లకు ప్యాకేజీలు మాట్లాడేశారని ఆరోపణలొచ్చాయి. పోక్సో కేసు వార్తలు ప్రసారం చేయొద్దని, ప్రచురించవద్దని చెప్తూనే.. ఆ కేసును ఒక ‘హనీట్రాప్’గా చిత్రీకరించాలని సూచనలు అందాయి. కాసులకు కక్కుర్తిపడ్డ ఆ సంస్థలు అలాగే ప్రసారం చే శా యి. మెయిన్‌స్ట్రీమ్ మీడియాలో నమస్తే తెలంగాణ, టీన్యూస్, తెలంగాణ టుడే, డిజిటల్ మీ డియాలో తెలుగుస్ర్కైబ్, మిర్రర్ వంటివి, పలు సోషల్ మీడియాలో పలు వేదికలు బాధితురాలి పక్షాన పోరాటమే చేశాయి. ప్రధాన వార్తా కథనాలు రోజంతా ప్రసారం చే యడంతో అసలు వాస్తవం ప్రజలకు తెలిసిం ది. బాధితురాలు తరఫున బీఆర్ఎస్ చేస్తు న్న పోరాటాన్ని ‘నమస్తే తెలంగాణ’ ప్రముఖంగా ప్రచురిస్తుండటంతో కాంగ్రెస్-బీజేపీ మైత్రికి బీటలు వారాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ కేసులో ప్రత్యేకంగా ముఖ్యమంత్రి కలుగజేసుకోవాల్సి వచ్చింది. నాటి నుంచి నేటి వరకూ తెలంగాణ పక్షాన, బాధితుల తరఫున పోరాడుతున్న ‘తెలంగాణ మీడియా’కు అటు ప్రజల నుంచి, సోషల్ మీడియా నుంచి పెద్ద ఎత్తున అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రధాని మీటింగ్‌లో సాక్షాత్తు సీఎం, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్లిద్దరూ చెట్టాపట్టాలేసుకొని, నవ్వులు చిందిస్తున్న వీడియోలు, ఫొటోలు దేశవ్యాప్తంగా వైరల్ కావడంతో సీఎం రేవంత్‌రెడ్డిలో చలనం వచ్చింది. ఆ ఫొటోలు, వీడియోలతో జాతీయ మీడియా వార్తలు ప్రసారం చేస్తుండటంతో డ్యామేజీని గుర్తించిన సీఎం.. ఆలస్యంగానైనా స్పందించారు. తెలుగులో తన అనుకూల మీడియాలో వార్తలు వేయించారు. కేసు నమోదు దగ్గరి నుంచి, బాధితురాలికి అడుగడుగునా జరుగుతున్న అన్యాయంపై గత నాలుగు రోజులుగా నోరు విప్పని ఓ వర్గం తెలుగు మీడియా.. సీఎం ప్రకటనతో నిద్రలేచింది. జూలు విదిల్చిన చందంగా ముఖ్యమంత్రి ప్రకటనను బ్రేకింగ్ న్యూస్ వండివార్చింది. మూడు రోజులుగా బీఆర్ఎస్ మహిళా విభాగం, విద్యార్థి విభాగం పోరాటాన్ని, ముఖ్యనేతల ప్రకటనలను ఏమాత్రం కవర్ చేయని మీడియా.. ఆ కేసు క్రెడిట్ అంతా ముఖ్యమంత్రికి ఇచ్చేసింది.
పో క్సో కేసు నిందితుడు బండి భగీరథ్ పరారీ లో ఉన్నట్టు భావిస్తున్నామని, సీబీఐ ఇతర విభాగాల నుంచి సమాచారం సేకరిస్తున్నామని దర్యాప్తు పర్యవేక్షణాధికారి, కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ గైక్వాడ్ తెలిపారు. ఇప్పటివరకూ నిందితుడు దొరుకలేదని త ప్పక పట్టుకుంటామని ఆమె తెలిపారు. భగీరథ్‌ను పట్టుకొనేందుకు సీడీఆర్(కాల్ డాటా రికార్డ్) పెట్టినట్టు వెల్లడించారు. పోక్సో కేసు దర్యాప్తు పర్యవేక్షణాధికారి రితిరాజ్ గైక్వాడ్ సోమవారం సాయంత్రం తొలిసారి పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. ఈ కేసుపై ప్రాథమిక విచారణ చేపట్టారు. ఏసీపీ శంకర్‌రెడ్డి, సీఐ విజయవర్ధన్తో ఆమె చర్చించారు. కేసులో ఇప్పటివరకూ జరిగిన పరిణామాలపై వివరా లు సేకరించామని, తదుపరి చర్యల కోసం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామని ఆమె తెలిపా రు. పోక్సో చట్టంప్రకారం విచారణ, చర్యలుంటాయని చెప్పారు.
బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై బాధిత బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ నెల 8న ఎఫ్ఐఆర్ నమోదైంది. బాధితురాలి తల్లి ఫిర్యాదు చేయకముందే భగీరథ్ కూడా కరీంనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిండు. అన్నింటిమీదా కలిపి సీనియర్ మహిళా అధికారిని విచారణాధికారిగా నియమించినం. బీఆర్ఎస్ వాళ్లు అడిగినట్టు క్షణాల్లో విచారణ జరుగదు. -సీఎం రేవంత్
ఓ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో నిందితునిగా ఉన్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ను పోలీసులు అరెస్టు చేయకపోవడంపై పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న స్పెషల్ ఆఫీసర్ రితిరాజ్ గైక్వాడ్ మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు ఆయన కాల్ డాటాను సేకరిస్తున్నారని, దొరుకగానే పట్టుకుంటామని అన్నారు. దీంతో భగీరథ్ పరారీలో ఉన్నట్టు సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చక్కర్లు కొట్టాయి. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘కేంద్ర హోంమంత్రి కుమారుడు పరారీలో ఉన్నాడా? దేశ చరిత్రలో ఇదే మొదటిసారా?’ అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణలేకుండా పోయిందని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో సోమవారం మీడియాతో ఆమె మాట్లాడుతూ.. ఓ బాలిక హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ తనపై లైంగికదాడి చేశాడని ఫిర్యాదు చేసి మూడురోజులైనా నిందితుడిని అరెస్ట్ చేయకపోవడం దారుణమని మండిపడ్డారు.
ఉప్పల్, మే 11 : బాలికపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథ్ లైంగిక వేధింపులకు ఒడిగట్టడం దారుణమని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మండిపడ్డారు. చిలుకానగర్‌లోని బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర హోమ్ శాఖను దగ్గర పెట్టుకున్న రేవంత్‌రెడ్డి కుమ్మక్కై కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బాధితుల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుందని స్పష్టం చేశారు.
పోక్సో కేసులో నిందితుడిపై సరైన విచారణ జరగాలంటే కేంద్రమంత్రి బండిసంజయ్ రాజీనామా చేయాలని ఎమ్మెల్యే వివేకానంద్ డిమాండ్ చేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్టలో సోమవారం మీడియాసమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి కుమారుడు భగీరథ్‌పై కేసునమోదై 4 రోజులైనా అరెస్ట్ చేయకపోవడాన్ని తప్పుబట్టారు.
అటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి.. ఇద్దరూ కలిసి ఒక ఆడబిడ్డ ఆర్తనాదాన్ని అణచివేస్తూ, నేరస్తులకు రక్షణ కవచంలా మారుతున్నారని శాసనమండలిలో బీఆర్ఎస్ఎల్పీ విప్ దేశపతి శ్రీనివాస్ విమర్శించారు. కేంద్ర మంత్రి తన ఇంట్లోనే చట్టాన్ని బందీ చేయాలని చూడటం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
పోక్సో కేసులో నిందితుడైన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌ను పోలీసులు వెంటనే అరెస్ట్ చేయాలని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నీరుగారుస్తున్నాయని, బాధితురాలికి న్యాయం జరుగకుండా అడ్డుకుంటున్నాయని ఆరోపించారు.
బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథను తక్షణమే అరెస్ట్ చేయాలని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ డిమాండ్ చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని తన కొడుకును కాపాడుకునేందుకు చేస్తున్న ప్రయత్నంలో బాలిక కుటుంబ సభ్యులపై సాగిస్తున్న దుర్మార్గపు చర్యలపై తీవ్రంగా మండిపడ్డారు.
పోక్సో కేసు నమోదై రోజులు గడుస్తున్నా నిందితుడిని అరెస్టు చేయకపోవడం పోలీసుల వైఫల్యానికి పరాకాష్ఠ అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఒక ప్రకటనలో మండిపడ్డారు. సామాన్యుడికి ఒక చట్టం, కేంద్ర మంత్రి కుమారుడికి మరో చట్టమా? అని ప్రశ్నించారు. బాధితారాలి తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురిచేస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై కూడా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కొడుకు ఆచూకీ లేకపోయినా తండ్రిగా సంజయ్ కంగారు పడకుండా సభల్లో పాల్గొనడంపై అనుమానం కలుగుతున్నదని తెలిపారు.
రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా..? ఉంటే అసలు ఏం చేస్తున్నది? అని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి, కరీంనగర్ ఎంపీ సంజయ్ పదవి నుంచి తప్పుకొని తన కొడుకుపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు సహకారం ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై పని చేస్తున్నాయనడానికి బండి కొడుకు కేసు నిదర్శనం అని ఆరోపించారు.
బండి భగీరథ్.. మైనర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో పోలీసులు నిందితుడిపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి ప్రశ్నించారు. పోక్సో కేసు నమోదైతే పేదలకు ఒక న్యాయం, అధికారంలో ఉన్న వారికి మరో న్యాయం ఉంటుందా? అని నిలదీశారు. భగీరథ్‌ను అరెస్టు చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
పోక్సో కేసులో నిందితుడైన బండి భగీరథ్‌ను కాపాడటానికే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు పేరిట నాటకం ఆడుతున్నదని రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ విమర్శించారు. బండి సంజయ్ తన మిత్రుడని బహిరంగంగా సీఎం రేవంత్ ప్రకటించాక, డీసీపీ స్థాయి అధికారి ఆ మిత్రుని కుమారుడిని నిందితునిగా నమోదుచేసే అవకాశం ఉన్నదా? అని అనుమానం వ్యక్తంచేశారు.