హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్‌పై నమోదైన ర్యాష్ డ్రైవింగ్ కేసు దర్యాప్తును నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. హైదరాబాద్‌లోని ప్రజాభవన్ (ప్రగతి భవన్) ఎదుట ఉన్న బ్యారికేడ్లను ఇటీవల సాహిల్ తన వాహనంతో ఢీకొట్టినట్టు పోలీసులు కేసు నమోదు చేయడంతో నిందితులు పరారీలో ఉన్నారు. సాహిల్ దుబాయ్ వెళ్లిపోయాడన్న సందేహంతో లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి.
ఈ నేపథ్యంలో తమపై నమోదైన కేసు ను కొట్టేయాలంటూ నిందితులు అబ్దుల్ ఆసిఫ్, మరో ఐదుగురు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ కే లక్ష్మణ్ విచారణ చేపట్టారు. పిటిషనర్లపై చేసిన అభియోగాలకు సాక్ష్యాధారాలు లేనందున వారిపై ఎలాంటి చర్యలు చేపట్టరాదంటూ పోలీసులకు ఉత్తర్వులు ఇవ్వాలని నిందితుల తరఫు న్యాయవాది కోరారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వర్రావు స్పందిస్తూ.. కేసు దర్యాప్తు దశలో ఉన్నందున పిటిషనర్లకు స్టే ఇవ్వాల్సిన అవసరం లేదని వాదించారు. పోలీసులు, ఇతర అధికారుల సాయంతో పిటిషన ర్లు దుబాయ్‌కి పారిపోయారని, దుబాయ్ ఎంబసీ అనుమతి లేకుండా అకడి నుంచి పిటిషన్ వేస్తే అనుమతించకూడదని విజ్ఞప్తి చేశారు. కేసు దర్యాప్తుపై స్టే విధించేందుకు నిరాకరించిన హైకోర్టు.. తదుపరి విచారణను ఈనెల 9కి వాయిదా వేసింది.
రాష్ట్రంలో 75 చదరపు గజాల కంటే తకువ విస్తీ ర్ణం ఉన్న జాగాల్లో ఇండ్లు నిర్మించుకోవాలంటే ము న్సిపాలిటీ లేదా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అనుమతి పొం దాలని హైకోర్టు స్పష్టం చేసింది. హైదరాబాద్ నేరేడ్మెట్లోని వినాయక్‌నగర్‌లో ఓ వ్యక్తి 40 గజాలు, మరో వ్యక్తి 54 చదరపు గజాల జాగాలో చేపట్టిన ఇండ్ల నిర్మాణాలను నిలిపివేయాలంటూ జీహెచ్ఎంసీ నోటీసులు జారీ చేయడంతో వారు కోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై జస్టిస్ టీ వినోద్‌కుమార్ ఇటీవల విచారణ జరిపి, పైతీర్పును వెలువరించారు.