ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ జరపండి
తమ వ్యక్తిగత అవసరాలు తీర్చుకునేందుకు కొందరు పోలీసు అధికారులు ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడటం రాష్ట్రంలో పెను దుమారం రేపుతున్నది. ఈ వ్యవహారాన్ని దీంతో అధికార, ప్రతిపక్ష నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు.
- బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోండి: కిషన్‌రెడ్డి
- చీఫ్ జస్టిస్‌తో కేసు విచారణ జరిపించాలి: రఘునందన్
- నేనూ ఫోన్‌ట్యాపింగ్ బాధితుడినే: యెన్నం శ్రీనివాస్‌రెడ్డి
హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): తమ వ్యక్తిగత అవసరాలు తీర్చుకునేందుకు కొందరు పోలీసు అధికారులు ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడటం రాష్ట్రంలో పెను దుమారం రేపుతున్నది. ఈ వ్యవహారాన్ని దీంతో అధికార, ప్రతిపక్ష నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిన అధికారులపై విచారణ జరిపి తక్షణం చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ డిమాండ్ చేశారు.
బీజేపీ నాయకులు, కార్యాలయ సిబ్బంది ఫోన్లు ట్యాప్ చేసినట్టు భావిస్తున్నట్టు తెలిపారు. అవినీతి కుంభకోణాలకు పాల్పడటం, వ్యక్తులను బ్లాక్మెయిల్ చేసి కోట్లాది రూపాయలు వసూలు చేయడం కోసం ఫోన్ ట్యాపింగ్‌ను ఉపయోగించుకోవడం అత్యంత దుర్మార్గమని, ఈ వ్యవహారంపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేత బీఎల్ సంతోష్ ఫోన్ కూడా ట్యాప్ చేశారని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు సంగారెడ్డిలో ఆరోపించారు.
ఈ కేసును సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. డీజీపీగా రిటైర్డ్ అయిన తర్వాత మహేందర్‌రెడ్డి ఇప్పుడెక్కడ ఉన్నారు? ఇద్దరు అధికారులను అమెరికాకు ఎలా పంపిస్తారని ప్రశ్నించారు. హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో ఈ కేసు విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తాను కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తన ఫోన్ ట్యాపింగ్‌లో ఉన్నదని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆయన మంగళవారం డీజీపీ రవిగుప్తాను కలిసి ఓ వినతిపత్రం సమర్పించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతుల మహాధర్నా
Rahul Gandhi | జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా రాహుల్, ప్రతిపక్షాల పిటిషన్.. రిజిష్టర్ చేసిన సుప్రీంకోర్టు
తుమ్మడంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
Bulldozers: డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమకారుడి కాల్చివేత.. బుల్డోజర్లతో నిందితుడి ఇళ్లు కూల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

