అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లర్ అరెస్ట్
అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద 241 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌ను, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద 241 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌ను, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకకు చెందిన రాహుల్ అనే యువకుడు సులభంగా డబ్బు సంపాదించడానికి డ్రగ్స్ దందాలోకి దిగాడు. నైజీరియాకు చెందిన అంతర్జాతీయ డ్రగ్ స్మగ్లర్ మైఖేల్ జాన్సన్ అలియాస్ హానర్తోతో ఫేస్బుక్ ద్వారా పరిచయం పెంచుకున్నాడు.
మైఖేల్ జాన్సన్‌ను మూడు నెలల క్రితమే బెంగళూరు పోలీసులు దేశం నుంచి డిపోర్ట్ చేసినప్పటికీ, అతడు నైజీరియా నుంచే ఫోన్‌కాల్స్, వాట్సాప్ ద్వారా భారతదేశంలో డ్రగ్స్ నెట్వర్ను నడుపుతున్నాడు. ఈ క్రమంలో రాహుల్ అతడి వద్ద డ్రగ్స్‌ను కొనుగోలు చేసి ఇతరులకు అమ్ముతున్నాడు. అయితే ఇటీవల ఈగల్ ఫోర్స్ సిబ్బంది మోహిత్‌కుమార్ అనే డ్రగ్ పెడ్లర్‌ను పట్టుకోవడంతో రాహుల్ పేరు బయటికి వచ్చింది. దీంతో ఈగల్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సంతోష్ నేతృత్వంలోని బృందం బెంగళూరుకు వెళ్లి రాహుల్‌ను అరెస్ట్ చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భవాని మాతకు మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిశోర్ ప్రత్యేక పూజలు
ACB Case | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీసర సీఐపై ఏసీబీ కేసు నమోదు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
POCSO | స్కూల్లో పరిచయమై పెళ్లి పేరుతో మోసం.. పాపకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు
Baby Food | ఆరు నెలల్లోపు పిల్లల ఆహారంలో వీటిని కలుపొద్దు : FSSAI
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

