TS BIE | రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ఒకేషనల్ పబ్లిక్ ఎగ్జామ్స్‌ను మార్చి 15 నుంచి నిర్వహించనున్నట్లు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఒకేషనల్ పరీక్షలు మార్చి 15న, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి 16న ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు కొనసాగనున్నాయి.
ఫస్టియర్, సెకండియర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 15 నుంచి మార్చి 2 వరకు నిర్వహించనున్నారు. ఎథిక్స్, హ్యుమన్ వాల్యూస్, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలు మార్చి 4, 6 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. తదితర వివరాల కోసం tsbie.cgg.gov.in అనే వెబ్‌సైట్‌ను సందర్శించొచ్చు.